కాపుకాక...ఈనెల 31న కత్తిపూడిలో...

కాపుకాక...ఈనెల 31న కత్తిపూడిలో...
x
Highlights

ఏపీలో మరోసారి కాపు కాక మొదలయ్యింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ కాక మరింత రాజు కుంటుంది. కాపు ఉద్యమ పోరాటంలో తుని ఘటన జరిగి మూడేళ్లు పూర్తయ్యింది.

ఏపీలో మరోసారి కాపు కాక మొదలయ్యింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ కాక మరింత రాజు కుంటుంది. కాపు ఉద్యమ పోరాటంలో తుని ఘటన జరిగి మూడేళ్లు పూర్తయ్యింది. ఈ నేపధ్యంలో ఈ నెల 31న ముద్రగడ నేతృత్వంలో తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో కాపు జేఏసీ భేటీకి నిర్ణయించారు. మరో వైపు సమావేశం నిలువరించేందుకు అధికారయంత్రాంగం నిర్ణయించినట్లు చర్చ సాగుతోంది. అసలు సమావేశం జరుగుతుందా అందుకు అనువైన వాతావరణం ఉందా అన్నది ఆసక్తికరంగా మారింది.

గడిచిన మూడున్నరేళ్లుగా కాపు ఉద్యమం ఎన్నో పుంతలు తొక్కింది. కాపు ఉద్యమానికి సారధ్యం వహిస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో ఈనెల 31న తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి జాతీయ రహదారి పక్కనే కాపు జేఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. త్వరలో ఎన్నికలు జరుగబోతుండంటంతో కాపుల అంశాన్ని ఏ విధంగా పరిష్కరించాలో అన్న దానిపై అధికార టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది. మరో వైపు సమావేశం జరగకుండా ముందుగానే నిలువరించే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తీవ్ర చర్చ కొనసాగుతోంది.

గతంలో తుని ఘటన నేపథ్యంలో ముద్రగడ ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టాలని భావించినా అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇస్తుంది. ప్రస్తుతం భవిష్యత్తు కార్యాచరణ కోసం కత్తిపూడిలో కాపు జేఏసీ సమావేశాని అనుమతి కోరలేదని అధికారులు మరోసారి అడ్డుపుల్ల వేసే ప్రయత్నంలో ఉన్నారు. ముద్రగడ కదలికలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. కత్తిపూడిలో ఇప్పటికే పోలీసుల మోహరింపు మొదలయ్యింది. ముద్రగడ స్వస్థలం కిర్లంపూడిలోనూ పోలీసులు మోహరిపం చేసేందుకు నిర్ణయించారు. కాపు జేఏసీ సమావేశాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కాపు వర్గం నేతలు హెచ్చరిస్తున్నారు. కాపు ఉద్యమాల ఫలితంగానే వారు కోరిన విధంగా బీసీల్లో చేరిస్తే బి సేఫ్ గా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు.

కానీ కాపు ఉద్యమ నేతలు మాత్రం చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ కాపుల అభివృద్ధికి సహకరించడం లేదని కాపు జేఏసీ నేలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు చిత్తశుద్ధితో కాపులకు న్యాయం చేయాలని భావించి ఉంటే గవర్నర్ ఆమోదంతో బీసీల్లో చేర్చి ఉండేవారని అంటున్నారు. భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పనకే కాపు జేఏసీ సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటన్నారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్నందునే ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని కాపు జేఏసీ నేతలు భావిస్తున్నారు. కత్తిపూడిలో ఈనెల 31 కాపు జేసఏసీ సమావేశం సజావుగా సాగుతుందా లేదా ముద్రగ‌డ ఎలాంటి నిర్ణయం తీసుకుంటార‌న్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories