పొలిటికల్ బెట్టింగ్... టీడీపీ కార్యకర్త ప్రాణం తీసింది

పొలిటికల్ బెట్టింగ్... టీడీపీ కార్యకర్త ప్రాణం తీసింది
x
Highlights

రాజకీయ పలితాలపై జోరుగా బెట్టింగ్ పెడుతుంటారు బెట్టింగ్ రాయుళ్లు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చని. కానీ అదే వారు ఉహించిన ఫలితాలు రాకుంటే? ఒకవేళ...

రాజకీయ పలితాలపై జోరుగా బెట్టింగ్ పెడుతుంటారు బెట్టింగ్ రాయుళ్లు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చని. కానీ అదే వారు ఉహించిన ఫలితాలు రాకుంటే? ఒకవేళ ఎన్నికల ఫలితాలు తిరగబడితే పరిస్థితేంటి? అన్న విషయాన్ని కళ్లకు కడుతోంది ఈ ఘటన. తాను ప్రాణాంగా అభిమానించే ఎన్నికల్లో తమ పార్టీయే గెలుస్తుందని ఎంతో నమ్మకం పెట్టుకొని లక్షలకు లక్షలు కుమ్మరించి బెట్టింగ్ పెట్టి చివరకు ఫలితాలు తారుమారు కావడంతో ఏకంగా ఆ వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. కోడి పందేలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త బలవన్మరణం చెందాడు.

మొన్న వెలువడిన ఫలితాలపై బెట్టింగ్ కాసి రూ.12 లక్షలు పోవడంతో తీవ్ర మనస్తాపనికి లోనై తెలుగు తమ్ముడు నేటి ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వెలివెన్నుకు చెందిన కంఠమనేని వీర్రాజు టీడీపీకి పెద్ద ఫ్యాన్. పోయినా ఏడాదిలాగే ఈ సారి కూడా ఏపీలో పసుపు జెండా రేపరేప లాడుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే లగడపాటి సర్వేలో కుడా టీడీపీ బంపర్ మోజారీటి వస్తుందని జోస్యం చెప్పారు. దీంతో ఫుల్ ధీమా కనబరచిన వీర్రాజు బెట్టింగుల్లో టీడీపీ వైపు రూ.12 లక్షల మేర పెట్టాడు. కానీ ఫలితాలు వచ్చేసరికి ఒక్కసారిగా తిప్పికొట్టాయి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని అఖండ విజయం సాధించింది. టీడీపీ ఓడిపోవడంతో బెట్టింగుల్లో పెట్టిన రూ.12 లక్షలు పోయాయన్న బాధతో పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న వీర్రాజు కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆసుపత్రికి తరలించినా అప్పటికే వీర్రాజు మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మొత్తానికి బెట్టింగులు వల్ల ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయన్న మాట.

Show Full Article
Print Article
Next Story
More Stories