logo

'ఏపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలి'

ఏపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలి

ఏపీ బీజేపీ నేతలు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహను కలిశారు. ఏపీ ప్రజల డేటాను ఐటీ గ్రిడ్స్‌కు అప్పగించడంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కేంద్రం హోంమంత్రితో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని ప్రైవేట్‌ వ్యక్తులకు ఎలా అప్పగిస్తారంటూ ప్రశ్నించిన కన్నా నిందితుడిని చంద్రబాబు ఎందుకు కాపాడుతున్నారంటూ నిలదీశారు. ఏపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని గవర్నర్‌ను కోరినట్లు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

లైవ్ టీవి

Share it
Top