logo

ఫ్యామిలీ డైరెక్టర్ తో నందమూరి హీరో ..

ఫ్యామిలీ డైరెక్టర్ తో నందమూరి హీరో ..

శతమానం భవతి సినిమాకి గాను జాతీయ అవార్డు గెలుచుకున్న ఫ్యామిలీ దర్శకుడు సతీష్ వేగ్నేశతో నందమూరి కళ్యాణ్ రామ్ తన 17వ సినిమా చేయబోతున్నాడు. దేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పకులుగా సుప్రసిద్ధ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ వ్యవస్థాపకులు ఉమేష్ గుప్తా నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇందులో హీరొయిన్ గా మెహ్రీన్ ను ఫిక్స్ చేశారు. గోపి సుందర్ సంగీతం అందించనున్నారు.సతీష్ వేగ్నేశ సినిమాలలో మంచి మాస్ మాసాలాలు లేకపోయినా ఫ్యామిలీ మొత్తాన్ని ఎలివేట్ చేసే ఎలిమెంట్స్ కు ఎక్కడ కూడా లోటు ఉండదు . కళ్యాణ్ రామ్ తో చేసే సినిమా కూడా అదే తరహలో ఉండబోతున్నట్టు తెలిసింది. ఇప్పటిదాకా యాక్షన్ రోల్స్ లో కనిపించిన కళ్యాణ్ రామ్ ఇలాంటి ఫ్యామిలీ సబ్జెక్టు లో ఎలా కనిపిస్తాడో వేచి చూడాలి.






లైవ్ టీవి

Share it
Top