Top
logo

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ కొత్త నాటకానికి తెర..

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ కొత్త నాటకానికి తెర..
X
Highlights

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త నాటకానికి తెరతీశారు తప్ప ఫ్రంట్ కట్టాలని పూర్తిగా కమిట్ మెంట్ లేదన్నారు ఏపీ మంత్రి కళా వెంకట్రావు.

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త నాటకానికి తెరతీశారు తప్ప ఫ్రంట్ కట్టాలని పూర్తిగా కమిట్ మెంట్ లేదన్నారు ఏపీ మంత్రి కళా వెంకట్రావు. ఫ్రంట్ నడుపాలనుకునే వారు కోల్ కతా మీటింగ్ కు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. కేవలం బీజేపీ కనసన్నల్లో పని చేసే విధంగా ఫ్రంట్ తయారు చేయాలన్నది స్పష్టమవుతుందన్నారాయన. నాలుగున్నరేళ్లుగా ఏపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు ఏపీ మంత్రి కళా వెంకట్రావు. ప్రజలు ఆశించిన దానికన్నా ఎక్కువగా పని చేశామని చెప్పారు. జన్మభూమి కార్యక్రమంలో వచ్చిన ఆర్జీలను పరిశీలించామన్నారు.

Next Story