బ్రేకింగ్: వివేకా హత్య కేసులో కొత్త అనుమానాలు

బ్రేకింగ్: వివేకా హత్య కేసులో కొత్త అనుమానాలు
x
Highlights

వైఎస్ వివేకానందరెడ్డిది హత్యేనని పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్ట్ లో తేలింది. వైఎస్ వివేకా శరీరంపై మొత్తం 7 గాయాలు ఉన్నట్లు గుర్తించారు. నుదిటిపై రెండు...

వైఎస్ వివేకానందరెడ్డిది హత్యేనని పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్ట్ లో తేలింది. వైఎస్ వివేకా శరీరంపై మొత్తం 7 గాయాలు ఉన్నట్లు గుర్తించారు. నుదిటిపై రెండు లోతైన గాయాలున్నాయి. అలాగే తల వెనుక భాగంలో బలమైన గాయం ఉంది. సుత్తితో కొట్టినట్లుగా గాయం కనిపిస్తోంది. ఇక తొడపై కత్తిపోటు, చేతిలో బలమైన గాయం ఉన్నట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తేలింది. ఎందుకు మార్చారు? వైఎస్ వివేకా ఇంటి బ్యాక్ డోర్ తెరిచి ఉండటంతో పక్కా ప్లాన్ ప్రకారమే మర్డర్ జరిగినట్లు తెలుస్తోంది. బాత్‌రూమ్‌లో చాలా వరకు రక్తాన్ని పోలీసులు వచ్చేసరికే శుభ్రం చేసేశారా? ఇలా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ వివేకాపై డెడ్ బాడీపై మొత్తం ఏడు బలమైన గాయాలు ఉండగా, పదునైన ఆయుధంతోనే కొట్టిచంపినట్లు ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్ట్ లో తేలింది. నిన్న రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ఏం జరిగిందో విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ పేర్కొన్నారు. ఘటనా స్థలంలో వేలిముద్రలు దొరికాయని, మరిన్ని ఆధారాల కోసం అన్వేషిస్తున్నామని రాహుల్‌ దేవ్‌ శర్మ వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories