Top
logo

వివేకానందరెడ్డి మృతిపై స్పీడు పెంచిన పోలీసులు..

వివేకానందరెడ్డి మృతిపై స్పీడు పెంచిన పోలీసులు..
X
Highlights

వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి కేసులో స్పీడు పెంచిన పోలీసులు ఈ కేసుపై సిట్‌ ను ఏర్పాటు చేశారు. సీఐడీ అడిషనల్...

వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి కేసులో స్పీడు పెంచిన పోలీసులు ఈ కేసుపై సిట్‌ ను ఏర్పాటు చేశారు. సీఐడీ అడిషనల్ డీజీపీ అమిత్ గార్గ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసింది డీజీపీ కార్యాలయం. వివేకానందది సహజ మరణమని మొదట అందరూ భావించారు. అయితే, ఆయన శరీరంగా గాయాలు ఉండటంతో పలు అనుమానాలు తలెత్తాయి. దీంతో క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించాయి. అయితే, వివేకా మృతి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో కేసు తీవ్రత దృష్ట్యా, ఈ కేసు దర్యాప్తుపై సిట్ ను ఏర్పాటు చేశారు.

Next Story