logo

వైయస్ జగన్ పై కే ఏ పాల్ సంచలన వ్యాఖ్యలు..

వైయస్ జగన్ పై కే ఏ పాల్ సంచలన వ్యాఖ్యలు..

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఒకరి పై ఒకరు మాటల తూటలు పెల్చుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి జన్మలో ఏపీ సీఎం కాలేరన్నారు. ఏపీలో ఒక్కో సీటుకు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా కానీ వైసీపీ గెలవదని పేర్కొన్నారు. ఇప్పటికే మైనార్టీలు వైసీపీని వీడుతున్నారని పాల్ తెలిపారు. హెలికాప్టర్, ఫ్యాన్ గుర్తులు ఒకే విధంగా ఉండడంతో ఈసీకి ఫిర్యాదు చేశారన్నారు. అసలు ఈ రెండు గుర్తులకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని కేఏ పాల్ ఎద్దేవా చేశారు.

లైవ్ టీవి

Share it
Top