హెలికాప్టర్ గుర్తుకు ఓటేస్తే ఆ పార్టీకి పడింది: పాల్ సంచలన వ్యాఖ్యలు

హెలికాప్టర్ గుర్తుకు ఓటేస్తే ఆ పార్టీకి పడింది: పాల్ సంచలన వ్యాఖ్యలు
x
Highlights

ఏపీలో గత ఆదివారం (19)తేదిన ఎగ్జిట్ పోల్స్ వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ స్పందిస్తూ ఏపీ సార్వత్రిక ఫలితాలపై...

ఏపీలో గత ఆదివారం (19)తేదిన ఎగ్జిట్ పోల్స్ వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ స్పందిస్తూ ఏపీ సార్వత్రిక ఫలితాలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ తనను షాక్‌కు గురిచేశాయన్నారు కేఏ పాల్. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో నూటికి నూరుశాతం ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, అసలు హెలికాప్టర్ గుర్తుకు ఓటేస్తే ఫ్యాన్‌ గుర్తుకు పడిందని పాల్ ఆరోపించారు. ఇక మొన్న వెలువడిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలో కొన్ని టీడీపీకి, మరికొన్ని సర్వేలు వైసీపీకి 100 సీట్లు ఖాయమని చెబుతున్నాయని, అయితే ఎవరెన్ని అంచనాలు వేసినా ఏపీలో ప్రజాశాంతి పార్టీకి మాత్రం ఖచ్చితంగా 30 సీట్లు వస్తాయని కేఏ పాల్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో అమెరికా ఇంటెలిజెన్స్, రష్యన్ హ్యాకర్ల పాత్ర ఉన్నట్లు ఆధారాలతో సహా స్పష్టమైందన్నారు పాల్. తాజాగా వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌పై స్పందిస్తూ కేఏ పాల్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.

ఎన్నికల నిర్వహణలో ఈసీ ఘోరంగా విఫలమైందని, రీకాల్ చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఈసీ వ్యవహారంపై తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగితే మాత్రం బీజేపీ 150, కాంగ్రెస్ పార్టీకి 150కి దగ్గరగా సీట్లు వచ్చే అవకాశం ఉండేదన్నారు. నర్సాపురం లోక్‌సభ స్థానంలో తనకు అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. అక్కడ హెలికాప్టర్ గుర్తుకు ఓటు వేస్తే ఫ్యాన్ గుర్తుకు పడిందని ప్రజలు తనకు ఫిర్యాదు చేశారని అని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి 70-80 శాతం ఓట్లు పడ్డాయని కేఏ పాల్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories