ఎన్నికల వేళ పార్టీ లో 'జంపింగ్ జిలానీ'లు

ఎన్నికల వేళ  పార్టీ లో జంపింగ్ జిలానీలు
x
Highlights

ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో జంపింగ్ జిలానీలు ఎక్కువయ్యారు. ఏ పార్టీలో తమకు సీటు వస్తుందో ఆ పార్టీలోకి వెళ్లిపోతున్నారు. వైసీపీ నుంచి కొంతమంది...

ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో జంపింగ్ జిలానీలు ఎక్కువయ్యారు. ఏ పార్టీలో తమకు సీటు వస్తుందో ఆ పార్టీలోకి వెళ్లిపోతున్నారు. వైసీపీ నుంచి కొంతమంది టీడీపీలో చేరితే టీడీపీ నుంచి కొంతమంది వైసీపీలో చేరిపోతున్నారు. తాజాగా దెందులూరు నియోజకవర్గం వైసీపీ నేత అశోక్‌గౌడ్ లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిపోగా కాకినాడ మాజీ ఎంపీ హర్షకుమార్ చంద్రబాబు సమక్షంలో సైకిలెక్కేందుకు రంగం సిద్ధమైంది. ఏపీలో ఎన్నికల వేళ జంపింగ్ జిలానీలు పెరిపోతున్నారు. అక్కడ టిక్కెట్టు రాకుంటే ఇక్కడ ఇక్కడ రాకుంటే అక్కడ వాలిపోతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత అశోక్‌గౌడ్‌ తన అనుచరులతో కలిసి లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిపోయారు.

ఇక కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టీడీపీ నుంచి తిరిగి సొంత గూటికి చేరిపోగా కాకినాడ మాజీ ఎంపీ హర్షకుమార్ సీఎం చంద్రబాబు సమక్షంలో సైకిలెక్కడం ఖాయమైంది. తొలుత ఆయన టీడీపీలో చేరతారని, ఆ తర్వాత వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే హర్షకుమార్ టీడీపీలో చేరికపై ఆ పార్టీ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. దీంతో అమలాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా హర్షకుమార్ పేరును చంద్రబాబు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు టీడీపీకి రాజీనామా చేశారు. పెద్దాపురం అసెంబ్లీ టిక్కెట్టు ఆశించి భంగపడిన ఆయన రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి సిద్ధమైనా ఆఖరి నిమిషంలో చుక్కెదురైంది. రాజమండ్రి ఎంపీ సీటును సిట్టింగ్ ఎంపీ మురళీమోహన్ కోడలు దీపకు కేటాయించింది టీడీపీ అధిష్టానం. దీంతో పార్టీ మారారు బొడ్డు భాస్కరరామారావు. మొత్తానికి ఎన్నికల వేళ రాష్ట్రంలో జంపింగ్ జిలానీలు పెరిగిపోయారు. నామినేషన్లు వేసే లోపు ఎవరెవరెక్కడ ఉంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories