ఎన్టీఆర్‌ జయంతి.. నివాళులర్పించిన తారక్,కళ్యాణ్‌రామ్

ఎన్టీఆర్‌ జయంతి.. నివాళులర్పించిన తారక్,కళ్యాణ్‌రామ్
x
Highlights

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు 97వ జయంతి సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద నివాళులర్పించారు. మనవళ్లు జూనియర్...

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు 97వ జయంతి సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద నివాళులర్పించారు. మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ తెల్లవారుజామున 5.30గంటలకు ఎన్టీఆర్‌ ఘాట్‌కు వచ్చి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. తాతతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని తారక్ భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి, ఆయన కుమార్తె పురందేశ్వరి తదితరులు నివాళులర్పించారు.

1923, మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించిన నందమూరి తారక రామారావు తెలుగువారికి ఆరాధ్య దైవంగా నిలిచారు. వెండితెరపై నవరసాలు పండిస్తూ ప్రేక్షకులను మైమరిపించిన ఎన్టీఆర్.. విశ్వవిఖ్యాత నట సార్వభౌమగా పేరు తెచ్చుకున్నారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఆయన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి అక్కడా తనకు తిరుగులేదని నిరూపించారు. 1994లో మూడోసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన ఎన్టీఆర్ 1995లో టీడీపీలో వచ్చిన చీలిక కారణంగా సీఎం కుర్చీ దిగిపోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. 1996, జనవరి 18న ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.





Show Full Article
Print Article
Next Story
More Stories