Top
logo

జనసేన అభ్యర్థుల జాబితా విడుదల.. జేడీ ఇక్కడినుంచే పోటీ

జనసేన అభ్యర్థుల జాబితా విడుదల..  జేడీ ఇక్కడినుంచే పోటీ
X
Highlights

జనసేన పార్టీ అభ్యర్థుల ప్రకటన ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇప్పటికే రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే...

జనసేన పార్టీ అభ్యర్థుల ప్రకటన ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇప్పటికే రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులకు సంబంధించిన మరో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో విశాఖ ఎంపీ అభ్యర్థిపై పవన్ క్లారిటీ ఇచ్చారు. విశాఖపట్నం లోక్‌ సభ స్థానం నుంచి ఇటీవలే జనసేన తీర్థంపుచ్చుకున్న జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నట్టు జనసేన ప్రకటించింది.

శాసనసభ అభ్యర్థులు - విశాఖ పట్నం నార్త్‌: పసుపులేటి ఉషా కిరణ్‌,విశాఖ సౌత్‌: గంపల గిరిధర్‌,విశాఖ ఈస్ట్‌: కోన తాతా రావు,భీమిలి: పంచకర్ల సందీప్‌, అమలాపురం: శెట్టిబత్తుల రాజబాబు, పెద్దాపురం: తుమ్మల రామ స్వామి, పోలవరం: చిర్రి బాల రాజు,అనంతపురం: టి.సి. వరుణ్‌

Next Story