Top
logo

ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Highlights

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాగాలేదని...

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాగాలేదని స్పష్టం చేశారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో 30 నుంచి 40 శాతం మందిని మార్చాల్సిందే అని తేల్చిచెప్పారు. లేకపోతే చంద్రబాబు సర్కారు మరోసారి రావడం కష్టమే అని తెలిపారు. చంద్రబాబుకు పేరు తెచ్చే విధంగా ఎమ్మెల్యేల పనితీరు లేదని ఈ విషయంలో చంద్రబాబుతో తనకు విభేదాలున్నాయని జేసీ స్పష్టం చేశారు. మరోవైపు సరిహద్దుల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంటే కేంద్రంలో వచ్చేది మోడీ ప్రభుత్వమే అని మరోసారి సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా బీజేపీ అవతరిస్తుందని జోస్యం చెప్పారు.

Next Story