జేసీ అస్మిత్ రెడ్డి వర్సెస్ కేతి రెడ్డి పెద్దారెడ్డి..మరీ జేసీ కోట పదిలమేనా?

జేసీ అస్మిత్ రెడ్డి వర్సెస్ కేతి రెడ్డి పెద్దారెడ్డి..మరీ జేసీ కోట పదిలమేనా?
x
Highlights

జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి అది కంచుకోట. 35 ఏళ్లుగా అక్కడ వారి కుటంబ సభ్యులే ఎమ్మెల్యేలు. జేసీ దివాకర్ రెడ్డి ఆరు సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా...

జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి అది కంచుకోట. 35 ఏళ్లుగా అక్కడ వారి కుటంబ సభ్యులే ఎమ్మెల్యేలు. జేసీ దివాకర్ రెడ్డి ఆరు సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు, జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ తరఫున బరిలో ఉన్నారు. జేసీ అడ్డా తాడిపత్రిలో ఈసారి రసవత్తర పోరు సాగింది. టీడీపీ తరఫున బరిలో ఉన్న జేసీ అస్మిత్ రెడ్డికి వైసీపీ నుంచి కేతి రెడ్డి పెద్దారెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. మరి జేసీ కోట పదిలమేనా?

అనంతపురం జిల్లా తాడిపత్రి ఎన్నికలు, ఆ రెండు కుటుంబాల మధ్య యుద్ధాన్ని తలపించాయి. తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి రాజకీయ వారసుడు జేసీ అశ్మిత్‌రెడ్డి బరిలోకి దిగగా, వైసీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి సై అన్నారు. ఇప్పుడు జనం ఇద్దరిలో ఎవరికి ఓటేశారన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.ముఠా కక్షలకు, ఫ్యాక్షన్ గొడలవకు కేరాఫ్‌ అడ్రసయిన తాడిపత్రిలో ఈ ఎన్నికల్లోనూ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తమ అభిమాన నేతల కోసం అక్కడి కార్యకర్తలు ప్రాణాలను పణంగా పెడుతుంటారు. తాడిపత్రి మండలం వీరాపురంలో ఎన్నికల రోజు చెలరేగిన హింసలో టీడీపీ నేత చింతా భాస్కర్ రెడ్డి మృతి చెందడం, హింసాకాండకు పరాకాష్ట. వీటిని బట్టి అర్థమవుతోంది తాడిపత్రిలో ఈసారి ఎన్నిక ఎంత ప్రతిష్టాత్మకమో.

గతంలో ఎన్నడూలేని విధంగా తాడిపత్రిలో 81.26 శాతం నమోదైంది. 2014లో 79.35 నమోదవగా, ఈసారి దాదాపు రెండు శాతం పెరిగింది. ఓటర్లు బారులు తీరి అర్ధరాత్రి వరకూ క్యూలో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ శాతం పెరగడంపై ఇరు పార్టీల నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు. పసుపు, కుంకుమ, పింఛన్లు వంటివి తమను గెలిపిస్తుందని టీడీపీ కాన్ఫిడెన్స్‌గా ఉంది. గతంలో మాదిరే జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులే విజయం సాధిస్తారని ఆ పార్టీ నేతలంటున్నారు.

వైసీపీ నేతలు మాత్రం ఈసారి గెలుపు తమదే అని చెబుతున్నారు. దాదాపు 40 ఏళ్ల జేసీ పాలనకు అడ్డకట్ట పడిందని తాడిపత్రిలో జనం విసిగిపోయారని, వైసీపీకి పట్టం కట్టారని అంటున్నారు. ఈసారి పెద్దారెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని చెబుతున్నారు. ఇలా ఎవరి దీమా వారిదే. తాడిపత్రిలో 39 ఏళ్లుగా తమ ఆధిపత్యాన్ని చాటుతూ వస్తున్న జేసీ కుటుంబానికి వైసీపీ అడ్డకట్ట వేస్తుందా మరోమారు జేసీ కుటుంబాన్నే గెలుపు వరిస్తుందా అన్నది మే 23నే తేలుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories