జయరాం కేసులో మరో కోణం: పోలీసులతో కలిసి రాకేశ్ భూదందాలు

జయరాం కేసులో మరో కోణం: పోలీసులతో కలిసి రాకేశ్ భూదందాలు
x
Highlights

చిగురుపాటి జయరాం హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసులతో కలిసి రాకేశ్ రెడ్డి సెటిల్మెంట్లకు పాల్పడినట్టు విచారణలో తేలింది. హైదరాబాద్...

చిగురుపాటి జయరాం హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసులతో కలిసి రాకేశ్ రెడ్డి సెటిల్మెంట్లకు పాల్పడినట్టు విచారణలో తేలింది. హైదరాబాద్ శివార్లలో భారీగా సెటిల్మెంట్లకు పాల్పడ్డాడని ఒక్కో సెటిల్మెంట్‌కు పోలీస్‌లకు భారీగా నజరానాలు ఇచ్చేవాడని పోలీసు అధికారులు చెబుతున్నారు.

చిగురుపాటి జయరాం హత్యకేసులో నిందితుడు రాకేశ్ రెడ్డిని విచారిస్తున్న పోలీసులకు అనేక కొత్త విషయాలు తెలుస్తున్నాయి. రాకేశ్ రెడ్డి నెట్‌వర్క్ ఏ విధంగా విస్తరించిందనే విషయం తెలిసింది. హైదరాబాద్ శివార్లలో భారీగా సెటిల్మెంట్లకు పాల్పడ్డాడని ఒక్కో సెటిల్మెంట్‌కు పోలీస్‌లకు భారీగా నజరానాలు ఇచ్చేవాడని విచారణ అధికారులు చెబుతున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్, శేరిలింగంపల్లి, హయత్‌నగర్, ఆదిభట్ల, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు జరిగినట్టు పోలీసులు కనుగొన్నారు. ఖాళీ స్థలాలపై వివాదాలు సృష్టించి పోలీసులతో బెదిరింపులకు దిగేవాడని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ దందా పేరుతో పలువురు వ్యాపారులకు రాకేష్‌ టోకరా ఇచ్చినట్టు తెలుస్తోంది. బాగా డబ్బులున్న వ్యాపారులను పోలీసులతో కలిసి బెదిరించేవాడని దర్యాప్తులో తేలింది.

రాకేష్‌రెడ్డితో సంబంధం ఉన్న పోలీసులపై విచారణ అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. 11 మంది పోలీస్ అధికారులతో రాకేష్‌రెడ్డికి సంబంధాలు ఉన్నట్టు విచారణ అధికారులు గుర్తించారు. జయరామ్‌ను హత్య చేసిన విషయాన్ని మొదట రాయదుర్గం సీఐ రాంబాబుకు తెలియజేయగా హత్య జరిగిన ప్రాంతం తన పరిధిలోకి రాదని జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందిస్తానని చెప్పినట్టు అధికారులు తెలిపారు. అయితే జూబ్లీహిల్స్ పోలీసులను బురిడీ కొట్టించి రాకేష్ రెడ్డి పరారైనట్టు తెలుస్తోంది.

జయరాం హత్య కేసు నిందితులు రాకేశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు నాంపల్లి కోర్టులో ఫిబ్రవరి 16న హాజరుపరిచారు. అయితే వీరి నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని, అందుకు కస్టడీ కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్‌ వేశారు. దీంతో ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. రాకేశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ ఫిబ్రవరి 23 వరకు పోలీసు కస్టడీలోనే ఉండనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories