జయరాం హత్య కేసులో సంచలన నిజాలు...జయరామ్‌కు ఒక్క రూపాయి కూడా...

జయరాం హత్య కేసులో సంచలన నిజాలు...జయరామ్‌కు ఒక్క రూపాయి కూడా...
x
Highlights

ఎన్ఆర్‌ఐ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రాకేష్ రెడ్డి...

ఎన్ఆర్‌ఐ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రాకేష్ రెడ్డి చిగురుపాటి జయరాంకు ఒక్క రూపాయి కూడా అప్పుగా ఇవ్వలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే డబ్బు డిమాండ్ చేయడం పలువురి ప్రమేయం ఉందని భావిస్తున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే చిగురుపాటి జయరాం మేనకోడలు శ్రిఖా చౌదరిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. నిందితుడు రాకేష్ రెడ్డితో పరిచయాలు, ఇతర వ్యాపార లావాదేవీలపై ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో నిందితులను రెండో రోజు కస్టడికి తీసుకున్న పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ నిర్వహిస్తున్నారు.

అమ్మాయి పేరుతో జయరాంను ట్రాప్ చేసిన రాకేష్ రెడ్డి తన ఇంటికి పిలిపించి నిర్భందించినట్టు పోలీసులు గుర్తించారు. డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానంటూ బెదిరించడంతో కోస్టల్ బ్యాంకు ప్రతినిధి నుంచి అప్పటికప్పుడు జయరాం ఆరు లక్షలు ఇప్పించినట్టు గుర్తించారు. ఇంకా డబ్బు కావాలంటూ చిగురుపాటి జయరాంను హింసిచడంతో అక్కడికక్కడే చనిపోయినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు జయరాం తనకు నాలుగు కోట్ల రూపాయలు అప్పు ఉన్నాడంటూ ఫేక్ ప్రామిసరి నోట్లు తయారి చేయించాడు. వేర్వేరు వ్యక్తుల పేర్ల మీద ఉన్న ప్రామిసరి నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అయితే జయరాంను ట్రాప్ చేయడం దగ్గరి నుంచి డబ్బు డిమాండ్ చేయడం వెనక ఇతర శక్తుల ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు .

ఇదే సమయంలో రాకేష్‌ కాల్ లిస్ట్‌ను పరిశీలించిన పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. రాకేష్ పలువురు రియల్ ఎస్టేట్‌, పోలీస్ , సినీ,రాజకీయ ప్రముఖులు టచ్‌లో ఉన్నట్టు గుర్తించారు. కాల్ లిస్ట్ ఆధారంగా పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. చిగురుపాటి జయరాంను హత్య చేసిన అనంతరం రాకేష్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడారనే కోణంలో విచారిస్తున్నారు .

Show Full Article
Print Article
Next Story
More Stories