మానవత్వం చాటుకున్న జవాన్లు .. చేతులపై నడిపించి తోటి సైనికుడి చెల్లి పెళ్లి చేశారు..

మానవత్వం చాటుకున్న జవాన్లు .. చేతులపై నడిపించి తోటి సైనికుడి చెల్లి పెళ్లి చేశారు..
x
Highlights

జమ్ముకశ్మీర్‌లోని బండిపొరాలో విధులు నిర్వహిస్తూ ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పొందాడు జ్యోతి ప్రకాశ్ నిరాలా అనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన గరుడ...

జమ్ముకశ్మీర్‌లోని బండిపొరాలో విధులు నిర్వహిస్తూ ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పొందాడు జ్యోతి ప్రకాశ్ నిరాలా అనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన గరుడ కమాండో.. అయితే జ్యోతి ప్రకాశ్ నిరాలా చెల్లెలు చంద్రకళ అనే చెల్లలు ఉంది . ఆమె వివాహాన్ని దగ్గరుండి అంగరంగ వైభవంగా నిర్వహించారు తోటి సైనికులు... 100 మంది గరుడ కమాండోలు దగ్గరుండి మరి నిరాలా చెల్లెలు పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారు. అన్నయ్య లేని లోటుని తీర్చారు అ సైనికులు .. నిరాలా కుటుంబ సంప్రదాయం ప్రకారం పెళ్లిల్లో అన్నయ్య చేతిలో చెల్లెలు అడుగు వేసుకుంటా నడవాలి. అయితే అప్పుడు సైనికులు తమ చేతులపై ఆమెను నడిపించి అన్నయ్య బాధ్యతలను పంచుకున్నారు. అంతే కాకుండా తల 500 రూపాయలు వేసుకొని 5లక్షలు డబ్బును సేకరించి ఆ కుటుంబానికి ఆర్ధికసాయంగా అందజేశారు. సైనికులు కదలి రావడంతో జ్యోతి ప్రకాశ్ నిరాలా ఆనందంతో పొంగిపోయింది. 100మంది దేశ సైనికులు తన బిడ్డకు అన్నలయ్యారని అమర జవాన్ తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. జ్యోతి ప్రకాశ్ నిరాలాను 2018లో ప్రభుత్వం అశోకచక్రను కూడా ప్రకటించింది.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories