పవన్ కళ్యాణ్‌కు అగ్నిపరీక్ష... 30 రోజుల్లో మ్యాజిక్ చేస్తారా ?

పవన్ కళ్యాణ్‌కు అగ్నిపరీక్ష... 30 రోజుల్లో మ్యాజిక్ చేస్తారా ?
x
Highlights

సార్వత్రిక సమరానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. దేశంలో ఎన్నికల నగారా మోగింది. 17వ లోక్‌ సభ కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో...

సార్వత్రిక సమరానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. దేశంలో ఎన్నికల నగారా మోగింది. 17వ లోక్‌ సభ కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 30 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ 30రోజుల్లోనే ఆయా పార్టీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం వంటీ కార్యక్రమాలు రాజకీయపార్టీలు చూసుకోవాలి. టీడీపీ, వైసీపీలు ఇప్పటికే తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను దాదాపు ఓ కొలిక్కి తీసుకొచ్చినట్టు వార్తాలు వినిపిస్తున్నాయి.

కాగా సార్వత్రిక నగారా మోగడంతో ఏపీలో అధికార తెలుగుదేశంపార్టీ 115 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. అలాగే జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. తొలి జాబితాలో 17 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, నలుగురు ఎంపీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. ఒక్క వైసీపీ పార్టీ మాత్రమే ప్రకటించాల్సి ఉంది. అయితే ఏపీలో టీడీపీ, వైసీపీలకు ధీటుగా ఎదగాలని జనసేన యత్నిస్తోంది. పవన్ సారథ్యంలోని జనసేన ఈ 30 రోజుల్లో వేగంగా నిర్ణయాలు తీసుకుని ప్రధాన రాజకీయ పార్టీలతో సమానంగా రాజకీయాలు చేస్తుందా అన్నది ఇప్పుడు అందరిలోనూ తీవ్ర ఆసక్తికరంగా మారింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాలు మినహా ఇంకఎవరితోనూ పొత్తులు ఉండవని జనసేనాని స్ఫష్టం చేసిన విషయం తెలిసిందే అయితే పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం ఇప్పటివరకు స్పష్టత రాకపోవడంతో ఆ పార్టీ వర్గాల్లో కొంత గందరగోళం నెలకొంది. అయితే ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీతో చూసుకుంటే జనసేనలో ఆశించిన స్థాయిలో ఎన్నికల జోష్ కనిపించడం లేదనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇన్ని సవాళ్ల నేపథ్యంలో జనసేన పార్టీ ఎలా ముందుకు సాగుతుంది ? ఈ మిగిలి ఉన్న 30 అంటే 30 రోజుల్లో టీడీపీ,వైసీపీ పార్టీలకు పోటీ ఇచ్చేంత స్థాయికి జనసేన దూసుకెళుతుందా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

Show Full Article
Print Article
Next Story
More Stories