జనసేన ఎంట్రీతో ఎవరికి నష్టం..? ఎవరికి లాభం?

జనసేన ఎంట్రీతో ఎవరికి నష్టం..? ఎవరికి లాభం?
x
Highlights

చూడప్పా సిద్దప్పా సింహం గడ్డం గీసుకోలేదు తాను మాత్రం గీసుకోగలను మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌ అంటూ, ఓ సినిమాలో డైలాగ్ చెబుతాడు పవన్ కల్యాణ్‌. ఇప్పుడు ఇదే...

చూడప్పా సిద్దప్పా సింహం గడ్డం గీసుకోలేదు తాను మాత్రం గీసుకోగలను మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌ అంటూ, ఓ సినిమాలో డైలాగ్ చెబుతాడు పవన్ కల్యాణ్‌. ఇప్పుడు ఇదే డైలాగ్‌ 2009, 2019 ఎన్నికలకూ సరిపోతుంది. అప్పుడు, ఇప్పుడు త్రిముఖ పోటీనే, ఏమంటే రెండు పార్టీల పేర్లు మాత్రం మారాయి. మిగతాదంతా సేమ్‌ టు సేమ్. మరి నాడు, నేడూ మెగా బ్రదర్స్‌కు కీలకమైన తూర్పు గోదావరిలోనూ, త్రిముఖ పోరుతో మారిపోతున్న సమీకరణలేంటి? నాటికి నేటికి ఎవరి బలమెంత? జనసేన ఎంట్రీతో ఎవరికి నష్టం....ఎవరికి లాభం?

తూర్పు గోదావరి జిల్లా, 2009 ఎన్నికల్లో 77.8శాతం పోలింగ్ నమోదైంది. అంటే 26 లక్షల 60వేల 568 ఓట్లు పోలవ్వగా, అందులో ప్రజారాజ్యం పార్టీకి 8 లక్షల 5వేల 836కు పైగా ఓట్లు పోలయ్యాయి. అధికార కాంగ్రెస్‌కి 8 లక్షల 97వేల 19 ఓట్లు పోలవ్వగా, తెలుగుదేశానికి 7లక్షల 29 వేల610 ఓట్లు పడ్డాయి. స్వతంత్ర అభ్యర్ధులు, ఇతరులు కలిపి 95వేల 575 ఓట్లు దక్కించుకోగా, లోక్‌సత్తా పార్టీ 41వేల ఓట్లు దక్కించుకుంది. అంటే అటు ప్రజారాజ్యం, ఇటు తెలుగుదేశం పార్టీలు చెరో నాలుగు అసెంబ్లీ స్థానాలే దక్కించుకున్నప్పటికీ, మూడు పార్టీలకు మధ్య లక్ష ఓట్లు లోపే తేడా వుందన్న మాట.

అప్పట్లో, జిల్లాలో ప్రజారాజ్యం 4 స్థానాల్లో గెలిస్తే, తెలుగుదేశం నాలుగు స్థానాలోనే గెలిచింది. ఆ 8 అసెంబ్లీ స్థానాలు పోతే 19లో, 11స్థానాల్లో అధికార కాంగ్రెస్‌ గెలిచి, తిరిగి అధికారంలోకి వచ్చింది. 92వేల ఓట్ల తేడాతోనే అప్పట్లో కాంగ్రెస్ 11 సీట్లను గెల్చుకోవడం, ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఓట్ల పరంగా అప్పుట్లో ప్రజారాజ్యం రెండోస్థానంలో నిలిచింది. తూర్పు గోదావరి జిల్లా సెంటిమెంట్‌ కూడా వర్కౌట్ అయింది. 2009కి, ఇప్పటికి మధ్య పార్టీల పేరు మారినా, ఒకేరకమైన పోటీ నెలకొందని చెప్పొచ్చు. అపుడు సిఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో ఎన్నికలు జరిగాయి. తిరిగి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ నుంచే దాదాపుగా పుట్టినట్టుగా ఏర్పడిన వైసీపీ పార్టీకి, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తనయుడు వైఎస్ జగన్‌ నాయకత్వం వహిస్తున్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం దాదాపుగా వైసీపీకి మళ్లింది.

అలాగే ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేయడంతో, అదే కుటుంబానికి చెందిన పవన్‌ కళ్యాన్‌ జనసేనను 2014 ఎన్నికలకు ముందు స్వయంగా స్థాపించారు. అప్పట్లో తెలుగుదేశానికి మద్దతిచ్చిన జనసేన, ఇపుడు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడంతో పోటీ రసవత్తరంగా మారింది. మొత్తం మీద పార్టీలు పేర్లు మారినా కాస్త అటూగా 2009లో పోటీపడిన పార్టీలే ఇపుడు 2019లో తలపడ్డాయని బేరీజు వేస్తున్నారు. అయితే ఇపుడు 2019లో 80శాతం పోలింగ్‌ నమోదై 33లక్షల 63వేల 352 ఓట్లు పోలయ్యాయి. వీటిలో ఎవరికీ ఏ విధంగా ఓట్లు పడ్డాయి? జనసేన ఎవరి ఓట్లుకు గండికొట్టిందో.? 19 అసెంబ్లీ స్థానాల్లో అత్యధికం ఎవరివో అన్న ఉత్కంఠకు తెరపడాలంటే మే 23వరకూ నిరీక్షించక తప్పదు.



Show Full Article
Print Article
Next Story
More Stories