జ‌న‌సేన తొలి జాబితా విడుద‌ల‌

జ‌న‌సేన తొలి జాబితా విడుద‌ల‌
x
Highlights

సార్వత్రిక పోరు కోసం జన సైనికులు రెడీ అయ్యారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కల్యాణ్ పేర్లను ప్రకటించారు. తొలి విడతగా 32 అసెంబ్లీ అభ్యర్థులకు...

సార్వత్రిక పోరు కోసం జన సైనికులు రెడీ అయ్యారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కల్యాణ్ పేర్లను ప్రకటించారు. తొలి విడతగా 32 అసెంబ్లీ అభ్యర్థులకు నలుగురు లోక్‌సభ అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు. వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న జనసేన ఇంకా సీట్ల సర్దుబాటు చర్చలు జరుపుతోంది. ఏ పార్టీ ఎన్ని సీట్లనేది ఎల్లుండి తేలుతుంది.

జనసేన అభ్యర్థుల తొలి జాబితాను పవన్ కల్యాణ్ విడుదల చేశారు. 32 అసెంబ్లీ, నలుగురు ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అమలాపురం లోక్‌సభ అభ్యర్థిగా డీఎంఆర్‌ శేఖర్‌, రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణ, విశాఖ ఎంపీ స్థానానికి గేదెల శ్రీనుబాబు , అనకాపల్లి నుంచి చింతల పార్థసారథి పేర్లు జాబితాలో ఉన్నాయి. ఇక అసెంబ్లీకి వారీగా చూస్తే తెనాలి నియోజకవర్గానికి మాజీ స్సీకర్ నాదెండ్ల మనోహర్ , ప్రత్తిపాడుకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, పాడేరు అసెంబ్లీ సీటుకు - మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, పి. గన్నవరం నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి జనసేన తరుపున బరిలో ఉంటారు.

రాజమండ్రి రూరల్ స్థానానికి -కందుల దుర్గేష్, గుంటూరు పశ్చిమ -తోట చంద్రశేఖర్, య‌ల‌మంచిలి- సుంద‌ర‌పు విజ‌య్‌కుమార్‌ , పాయ‌క‌రావుపేట- న‌క్కా రాజ‌బాబు, పాడేరు -ప‌సుపులేటి బాల‌రాజు , రాజాం- డాక్ట‌ర్ ముచ్చా శ్రీనివాస‌రావు, .శ్రీకాకుళం- కోరాడ స‌ర్వేశ్వ‌ర‌రావు, ప‌లాస‌- కోత పూర్ణ‌చంద్ర‌రావు, ఎచ్చెర్ల‌- బాడ‌న వెంక‌ట‌ జ‌నార్ధ‌న్, నెల్లిమ‌ర్ల‌- లోకం నాగ‌మాధ‌వి , తుని- రాజా అశోక్‌బాబు, రాజోలు- రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌ , కాకినాడ సిటీ- ముత్తా శ‌శిధ‌ర్‌, అన‌ప‌ర్తి- రేలంగి నాగేశ్వ‌ర‌రావు, ముమ్మిడివ‌రం- పితాని బాల‌కృష్ణ‌, మండ‌పేట‌-వేగుళ్ల లీలాకృష్ణ‌ , తాడేప‌ల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్‌, ఉంగుటూరు- న‌వుడు వెంక‌ట‌ర‌మ‌ణ‌, ఏలూరు- రెడ్డి అప్ప‌ల‌నాయుడు, వేమూరు- డాక్ట‌ర్ ఎ.భ‌ర‌త్ భూష‌ణ్‌, నర‌స‌రావుపేట‌- స‌య్య‌ద్‌ జిలానీ, కావ‌లి- ప‌సుపులేటి సుధాక‌ర్‌, నెల్లూరు రూర‌ల్‌ -చెన్నారెడ్డి మ‌నుక్రాంత్ రెడ్డి, ఆదోని- మ‌ల్లిఖార్జున‌రావు, ధ‌ర్మ‌వ‌రం-మ‌ధుసూద‌న్‌రెడ్డి, రాజంపేట‌- ప‌త్తిపాటి కుసుమ‌కుమారి, రైల్వే కోడూరు- డాక్ట‌ర్ బోనాసి వెంక‌ట‌ సుబ్బ‌య్య‌, పుంగ‌నూరు- బోడే రామ‌చంద్ర‌ యాద‌వ్‌, మ‌చిలీప‌ట్నం- బండి రామ‌కృష్ణ‌ పేర్లును పవన్ కల్యాణ్ ప్రకటించారు.

జనసేన, వామపక్షాల మధ్య సీట్ల పంపిణీ అంశంపై ఈ నెల 16న స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి పవన్‌ కల్యాణ్‌తో వామపక్ష నేతలు భేటీ అయ్యి సీట్ల సర్దుబాటు గురించి చర్చించి ఎవరెక్కడ పోటీ చేయాలో నిర్ణయిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories