logo

బీఎస్పీతో జనసేన పొత్తు ఖరారు..ఎన్ని సీట్లు కేటాయించిందంటే..

బీఎస్పీతో జనసేన పొత్తు ఖరారు..ఎన్ని సీట్లు కేటాయించిందంటే..

ఏపీలో జనసేన, బీఎస్పీ మధ్య పొత్తు ఖరారు అయింది. బీఎస్పీకి మూడు లోక్ సభ సీట్లు, 21 అసెంబ్లీ స్థానాలను జనసేన కేటాయించింది. విజయవాడలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో బీఎస్పీ ఎంపీ వీర్ సింగ్, జనసేన నాయకుల మధ్య చర్చలు జరిగాయి.తిరుపతి, చిత్తూరు, బాపట్ల పార్లమెంట్ సీట్లు, 21 అసెంబ్లీ స్థానాలు బీఎస్పీకి కేటాయించారు. బీఎస్పీ, జనసేన పొత్తుపై జనసేనాని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే దళితుడిను సీఎం చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని గుర్తు చేశారు. మాయవతిని భారత ప్రధానిగా చూడాలన్నది తన కోరికన్నారు పవన్. గత 2008లోనే బీఎస్పీ అధ్యక్షుడిగా ఉండాలని తనకు ఆహ్వానం వచ్చిందని కానీ అప్పటి పరిస్థితులతో సాధ్యపడలేదన్నారు.

లైవ్ టీవి

Share it
Top