టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిందా..?

టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిందా..?
x
Highlights

టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిందా..? మొన్నటివరకు విమర్శలు చేసుకున్న పార్టీలు ఇప్పుడు చేతులు కలుపుతున్నాయా..? త్వరలోనే ఒకే వేదికపై చంద్రబాబు, పవన్‌ కనిపిస్తారా..? 2014 ఫార్ములాను మరోసారి రిపీట్‌ చేయాలని అనుకుంటున్నారా..?

టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిందా..? మొన్నటివరకు విమర్శలు చేసుకున్న పార్టీలు ఇప్పుడు చేతులు కలుపుతున్నాయా..? త్వరలోనే ఒకే వేదికపై చంద్రబాబు, పవన్‌ కనిపిస్తారా..? 2014 ఫార్ములాను మరోసారి రిపీట్‌ చేయాలని అనుకుంటున్నారా..? కొన్నాళ్ల కిందటి వరకు టీడీపీ, జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో రెండు పార్టీల మధ్య చిన్నపాటి విమర్శలు కూడా వినిపించడం లేదు. ఎవరూ ఇంకెవరిని టార్గెట్‌ చేస్తున్నట్లు కూడా కనిపించడం లేదు. దీంతో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే రాష్ట్రాభివృద్ధి కోసం పవన్‌ తమతో కలిసి రావాలంటూ ఆ మధ్య చంద్రబాబు పదే పదే విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో తాము వామపక్షాలతో తప్ప ఎవరితోనూ పొత్తు పెట్టుకునేది లేదని పవన్‌ పార్టీ తేల్చిచెప్పింది. కానీ టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, వైసీపీ అధినేత జగన్‌ సమావేశం తర్వాత జనసేన వైఖరిలో మార్పు వచ్చినట్లు చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రలు జరుగుతున్నాయంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలు.. ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది.

దీంతో పవన్‌ పార్టీ, చంద్రబాబు పార్టీలు కలుస్తున్నాయంటూ ప్రచారం జోరందుకుంది. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు చర్చలు కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రెండు పార్టీల పొత్తు కుదిరిందని డీల్‌ అయిపోయిందనే ప్రచారం పొలిటికల్‌ కారిడార్లో వినిపిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories