తమ్ముళ్ల తగువులాట... బాబు ఎలా డీల్‌ చేస్తారు?

tdp
x
tdp
Highlights

కడప జిల్లా జమ్ములమడుగు టికెట్ కేటాయింపు టీడీపీకి కత్తి మీద సాములా మారింది. టికెట్ కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతూ ఉండటంతో అధినేత చంద్రబాబుకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది.

కడప జిల్లా జమ్ములమడుగు టికెట్ కేటాయింపు టీడీపీకి కత్తి మీద సాములా మారింది. టికెట్ కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతూ ఉండటంతో అధినేత చంద్రబాబుకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఎమ్మెల్యే టికెట్ కోసం ఇరువురు నేతలు పట్టువీడకపోవడం తీవ్ర ఉత్కంఠ రేపుతొంది. పార్టీ ప్రయోజనాలతో ముడిపడిన వ్యవహారం కావడంతో చంద్రబాబు అచితూచీ వ్యవహరిస్తున్నారు.

వైఎస్ ఫ్యామిలి కంచుకోట కడప కడప కోటను బద్ధలు కోట్టాలని భావిస్తున్న సీఎం చంద్రబాబుకు జమ్మలమడుగు నియోజకవర్గం పెద్ద సమస్యగా మారింది. టికెట్ ఆశిస్తున్న ఇద్దరు నేతలతో అధినేత చంద్రబాబు నాయుడే స్వయంగా చర్చలు జరిపినా ఫలితం రాలేదు. టికెట్‌ ఆశిస్తున్న వారిలో ఆదినారాయణరెడ్డి మంత్రిగా ఉండగా, - పి.రామసుబ్బారెడ్డి ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు. వైసీపీ తరఫున గెలిచిన ఆదినారాయణరెడ్డిని టీడీపీలో చేర్చుకున్న చంద్రబాబు ఏకంగా మంత్రి పదవిని కట్టబెట్టారు. రామసుబ్బారెడ్డి బహిరంగంగా వ్యతిరేకించినా చంద్రబాబు పార్టీ కోసమేనంటూ సముదాయించారు. అయితే త్వరలో జరుగబోయే ఎన్నికల్లో సీటు తమకే కావాలంటూ ఇరువురు నేతలు పట్టుబడుతున్నారు.

ఇరువురు నేతలు పట్టుబట్టడంతో మధ్యే మార్గంగా రాజీమారాన్ని సీఎం చంద్రబాబు సిద్ధం చేసినట్టు సమాచారం. టికెట్ కోసం పోటీ పడుతున్న ఇద్దరిలో ఒకరిని ఎంపీగా, మరొకరిని ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. దీనివల్ల నియోజకవర్గం పరిధిలో ఓట్లు చీలవని, ఎంపీ అభ్యర్థికి భారీ మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నారు. అయితే ఎవరు ఎక్కడ పోటీ చేయాలని ఇరువురు నేతలే తేల్చుకోవాలంటూ చంద్రబాబు కోరారు. దీంతో అధిష్టానం బోనులోకే నిర్ణయాన్ని ఇరువురు నేతలు నెట్టివేశారు. ఈ నేపధ‌్యంలో ఎంపీగా పోటీ చేయాలని మంత్రి ఆది నారాయణ రెడ్డికి చంద్రబాబు సూచించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తన వర్గం వారితో చర్చించి చెబుతానన్న మంత్రి ఆది నారాయణ రెడ్డి ఈ బాధ్యత మీరే తీసుకోవాలంటూ చంద్రబాబును కోరినట్టు సమాచారం.

పరిస్ధితులు ఎలా ఉన్నా తాను సేఫ్‌ మోడ్‌లో ఉండేలా మంత్రి ఆది ముఖ్యమంత్రి ముందు పలు డిమాండ్లు ఉంచినట్టు సమాచారం. తాను ఎంపీగా పోటీచేస్తే అన్ని మీరే చూసుకోవాలంటూ కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కడప పార్లమెంట్ పరిధిలోని మిగిలిన సీట్లలో వైసీపీ బలంగా ఉండటంతో అభ్యర్ధుల ఎంపిక ఇతర అంశాల్లో తనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే విషయంలో రామసుబ్బారెడ్డి వెనక్కు తగ్గక పోవడంతో అభ్యర్ది ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories