తమిళనాడులో జోరుగా జల్లికట్టు...జల్లికట్టు పోటీల్లో రెండు చోట్ల అపశృతి

Jallikattu
x
Jallikattu
Highlights

తమిళనాడులో పొంగల్ సందర్భంగా నిర్వహించే జల్లికట్టు పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. జల్లికట్టు నిర్వహణకు పేరున్న మధురై జిల్లా అవనియాపురంలో ప్రభుత్వ అనుమతితో ఇవాళ జల్లికట్టు పోటీలను ప్రారంభించారు.

తమిళనాడులో పొంగల్ సందర్భంగా నిర్వహించే జల్లికట్టు పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. జల్లికట్టు నిర్వహణకు పేరున్న మధురై జిల్లా అవనియాపురంలో ప్రభుత్వ అనుమతితో ఇవాళ జల్లికట్టు పోటీలను ప్రారంభించారు. అలాగే మదురై జిల్లాలో పాలమేడు, అలంగ నల్లూరులో జల్లి కట్టు పోటీలు జోరుగా నిర్వహిస్తున్నారు. అయితే పుదుకొట్టాయ్, అరియాలూర్ జిల్లాల్లో జల్లికట్టు ఆడుతున్న పలువురు గాయపడ్డారు.

పుదుకొట్టాయ్ జిల్లా తచాన్‌ కురిచిలో జరిగిన జల్లికట్టు ఉత్సవాల్లో అపశృతి దొర్లింది. ఎద్దులను అదుపు చేయడానికి యత్నించిన 13 మంది యువకులు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడు మొత్తంమ్మీద పుదుకొట్టాయ్ జిల్లాలోనే అత్యధికంగా ఎద్దుల పోటీలు జరుగుతాయి. ఇక్కడ 454 ఎద్దులు, 279 మంది ఈ క్రీడలో పాల్గొంటున్నారు. అటు అరియాలూర్ జిల్లాలో జరిగిన జల్లికట్టు పోటీల్లో 10 మంది గాయపడ్డారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళ సంప్రదాయ సాహస క్రీడ జల్లికట్టు పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది. సంక్రాంతి రోజు నుంచి వారం రోజుల పాటు జల్లికట్టు క్రీడ జరుగుతుంది. ఈ ఏడాది తమిళనాడు ప్రభుత్వ అనుమతితో మొత్తం 64 ప్రాంతాల్లో జల్లికట్టు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పోటీలు జరిపే బరులు ఉండాలని, పశువులను హింసించరాదని, వైద్యులు అందుబాటులో ఉండాలని పళనిస్వామి సర్కార్ ఆదేశించింది. జల్లికట్టులో పాల్గొనేందుకు 3400 మంది యువకులు పేర్లను నమోదు చేసుకోగా..2600 ఎద్దులు ఈ క్రీడలో పాల్గొంటున్నాయి. ఈ పోటీల్లో 18 నుంచి 40ఏళ్ల లోపు వారు మాత్రమే పోటీల్లో పాల్గొనాలనే నింబంధన ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories