డేరా బాబాకు మరో ఎదురుదెబ్బ

డేరా బాబాకు మరో ఎదురుదెబ్బ
x
Highlights

జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీంకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో బాబాతో పాటూ మరో ముగ్గుర్ని న్యాయస్థానం దోషులుగా తేల్చింది....

జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీంకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో బాబాతో పాటూ మరో ముగ్గుర్ని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. ఈ నెల 17న ముగ్గురికి శిక్షను ఖరారు చేయనుంది. డేరాబాబా దోషిగా తేలడంతో భద్రత కట్టుదిట్టం చేశారు. పంచకుల ప్రత్యేక కోర్టు ఆవరణలో పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తు జాగ్రత్తగా హర్యానా, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

సిర్సాలోని డేరా సచ్చా సౌద హెడ్ క్వార్టర్స్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి బయటపెట్టారు. 'పూరా' సచ్ పత్రికలో డేరాబాబ అరాచాకాలపై ఎన్నో కథనాలు వచ్చాయి. 2002 అక్టోబరులో జర్నలిస్ట్ రామచంద్ర దారుణ హత్యకు గురయ్యాడు. అతడ్ని డేరాబాబా అనుచరులు దారుణంగా హత్యచేశారనే ఆరోపణలతో కేసు నమోదయ్యింది. ఈ కేసును విచారణ జరిపిన కోర్టు బాబాతో పాటూ మరో ముగ్గుర్ని దోషులుగా తేల్చింది. అత్యాచారం కేసులో డేరాబాబాకు ఇప్పటికే 20 ఏళ్ల జైలు శిక్షపడింది. హర్యానాలోని సునారియా జైల్లో శిక్ష కూడా అనుభవిస్తున్నారు. అత్యాచారం కేసులో రామ్ రహీమ్‌ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు రావడంతో పంజాబ్, హర్యానా, ఢిల్లీల్లో అల్లర్లు రేగాయి. డేరా బాబా అనుచరులు, అభిమానులు రెచ్చిపోయారు. ఈ ఘర్షణల్లో 40 మందికిపైగా చనిపోయారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories