మంత్రుల ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు...ఐదుగురు సీనియర్లతో పాటు.. ?

మంత్రుల ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు...ఐదుగురు సీనియర్లతో పాటు.. ?
x
Highlights

ఏపీ మంత్రివర్గం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారయ్యింది. జూన్‌ 8 న కొత్త మంత్రులు కొలువుదీరబోతున్నారు. మరి మంత్రులుగా ఎవరు ప్రమాణస్వీకారం చేస్తారు..?...

ఏపీ మంత్రివర్గం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారయ్యింది. జూన్‌ 8 న కొత్త మంత్రులు కొలువుదీరబోతున్నారు. మరి మంత్రులుగా ఎవరు ప్రమాణస్వీకారం చేస్తారు..? జగన్‌ టీమ్‌లో ఎవరెవరు ఉండబోతున్నారు..? కొత్త కేబినేట్‌లో 13 జిల్లాల ప్రాతినిధ్యం ఉంటుందా..? ఎవరికి ఏ పోర్ట్ పోలీయో కేటాయిస్తారు..? అసలు జగన్‌ టీమ్‌ ఎలా ఉంటుంది..? ప్రభుత్వంలో.. కేబినేట్‌ కూర్పుపైనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

గురువారం ఏపీ నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జగన్ పాలనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఈ క్రమంలో కేబినెట్‌ కూర్పుపై కూడా కసరత్తు ప్రారంభించారు. జూన్‌ 8 న మంత్రుల ప్రమాణస్వీకారం చేస్తారు. ఉదయం 8 గంటలా 39 నిమిషాలకు సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్‌లోకి జగన్‌ అడుగుపెడతారు. సచివాలయం పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ తర్వాత వెంటనే మొదటి కేబినేట్‌ సమావేశం నిర్వహిస్తారు.

అయితే ఎవరికి మంత్రిపదవులు దక్కుతాయనే చర్చ ఉత్కంఠ రేపుతోంది. టీమ్‌ జగన్‌లో 15 మందికి అవకాశం ఉంటుందని అందులో ఐదుగురు సీనియర్లతో పాటు ఏమాత్రం అనుభవం లేని కొత్తవారికి కూడా చోటు కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు అన్ని సామాజిక వర్గాలకు కేబినెట్‌లో అవకాశం కల్పించే దిశగా జగన్‌ ఆలోచన ఉన్నట్లు చెబుతున్నారు. సామాజిక సమీకరణలు, అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం, సీనియర్లకు ప్రాధాన్యం ఇలా పలు అంశాల ప్రాతిపదికగా మంత్రివర్గ కూర్పు ఉంటుందని తెలుస్తోంది.

సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్న వైసీపీలో మంత్రివర్గంలో చోటు కోసం ఆశిస్తున్నవారి సంఖ్య భారీగానే ఉంది. తమకే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్న వారి మధ్య పోటీ నెలకొంది. కొందరైతే ఇప్పటికే తమకు కేబినేట్‌ బెర్త్‌ ఇప్పించాలంటూ తెలిసిన వారి నుంచి లాబీయింగ్‌ కూడా మొదలుపెట్టారు. ఇటు తమకు తెలిసిన వారితో శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి వారి నుంచి కూడా రికమండేషన్లు చేయిస్తున్నారనే కథనాలు వస్తున్నాయి.

మరోవైపు సెక్రటేరియట్‌లో వాస్తుకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. మొదటి బ్లాక్‌లోని సీఎం కార్యాలయంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సీఎం ఛాంబర్‌లోకి వెళ్లే ద్వారాల్లో ఒక ద్వారం మూసేశారు. అలాగే సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఛాంబర్‌ ఆగ్నేయ మూలలో కూడా మార్పులు చేస్తున్నారు. అలాగే పాత ఛాంబర్‌ పక్కన కొత్తగా మరో ఛాంబర్‌ నిర్మిస్తున్నారు. వీటితో పాటు కొత్త మంత్రులకు కూడా ఛాంబర్లను సిద్ధం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories