logo

ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం ఎక్కడంటే?

ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం ఎక్కడంటే?
Highlights

తిరుగులేని ప్రజాదరణ సొంతం చేసుకున్న వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి వేదిక ఎంపిక...

తిరుగులేని ప్రజాదరణ సొంతం చేసుకున్న వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి వేదిక ఎంపిక పూర్తయింది. వైసీపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా వేగంగా నిర్ణయాలు జరిగిపోతున్నాయి. ఈ నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇందుకు తిరుపతి వేదికగా మారనుంది. తిరుపతిలోని తారకరామా స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. వైసీపీ నాయకులు .. కార్యకర్తలు .. అభిమానుల సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ముందుగా ఆయన తిరుమల కొండపైకి చేరుకొని స్వామివారిని దర్శించుకున్న అనంతరం, ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొననున్నారు.


లైవ్ టీవి


Share it
Top