నేనే సీఎం అంటున్న జగన్.. తీవ్ర ఆసక్తి పెంచిన జగన్ ఫేస్‌బుక్ పోస్ట్..

నేనే సీఎం అంటున్న జగన్.. తీవ్ర ఆసక్తి పెంచిన జగన్ ఫేస్‌బుక్ పోస్ట్..
x
Highlights

కేవలం మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు. ఇప్పటికే ఎవరి గెలుపుపై వారి అంచనాలు.. ఎగ్జిట్ పోల్స్ కూడా ఓ అంచనాకు వచ్చి...

కేవలం మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు. ఇప్పటికే ఎవరి గెలుపుపై వారి అంచనాలు.. ఎగ్జిట్ పోల్స్ కూడా ఓ అంచనాకు వచ్చి ఫలితాలు వెలువరించాయి. ఇక కేంద్రంలో మరోసారి ఎన్డీయేదే పగ్గాలు చేపడుతుందని పలు సర్వేలు చెప్పగా, ఇక ఏపీలో వైసీపీ జయకేతనం ఎగురవేస్తుందని సర్వేలు అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆ పార్టీ నేతలు పదేపదే జోస్యం చెబుతున్నారు. అయితే, ఎగ్జిట్ పోల్స్‌పై జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా పల్లెత్తు మాట కూడా లేవనెత్తలేదు. అయితే, మంగళవారం మధ్యాహ్నం జగన్ మోహన్ రెడ్డి తన ఫెస్ బుల్‌లో విడుదల చేసిన ఒక పోస్టు తెలుగు ప్రజల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది. రాజన్న సుపరిపాలనను తీసుకురావాలన్నదే తన సంకల్పమని పేర్కొన్నారు.

ఇక ఈ పోస్టర్‌లో నవ్వుతూ మైకు పట్టుకుని జగన్ మోహన్ రెడ్డి ఉండటం చూస్తున్నాం. ప్రజాస్వామ్యంలో 'ప్రజాపరిపాలనే సాగాలి' అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ పోస్టర్ పై మండు టెండల్ని సైతం లెక్కజేయకుండా క్యూలలో నిలబడి ప్రజలు ఓట్లేశారని, ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనాన్ని నిలబెట్టారని, వారి ఆశీస్సులు అందిన వేళ వారికి బాధ్యుడినై ఉంటానని ‎ఆ పోస్టర్‌లో రాశారు. ఇప్పుడు ఆ పోస్టర్ సోషల్ మీడియా హల్ చల్ చేస్తోంది. దీంతో తానే సీఎం కాబోతున్నానని పరోక్షంగా వెల్లడించారు. మొన్న వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ తో జగన్‌లో ధీమా పెరిగింది అని చెప్పడానికి నిదర్శనం ఇదే. వైఎస్ జగన్ పోస్ట్‌కు పలువురు కార్యకర్తలు, వీరాభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.





Show Full Article
Print Article
Next Story
More Stories