logo

నామినేషన్‌ వేసిన వైఎస్‌ జగన్‌

నామినేషన్‌ వేసిన వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయానికి నేటి మధ్యాహ్నం కడప ఎంపీ అభ్యర్ధి అవినాష్ రెడ్డి, చిన్నాన్నలు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివప్రకాశ్ రెడ్డితో కలిసి 1.49 గంటలకు జగన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకు ముందు సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. అంతకుముందు స్థానిక సీఎస్‌ఐ చర్చి మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

లైవ్ టీవి

Share it
Top