Top
logo

అఫిడవిట్‌లో జగన్ పేర్కొన్న ఆస్తి ఎన్ని కోట్లంటే..

అఫిడవిట్‌లో జగన్ పేర్కొన్న ఆస్తి ఎన్ని కోట్లంటే..
X
Highlights

వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌నున్నారు....

వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌నున్నారు. ఆయన తాజాగా త‌న నామినేష‌న్ దాఖ‌లు చేశారు. దాంట్లో త‌న ఆస్తుల వివ‌రాల‌ను వెల్ల‌డించారు. త‌న‌కు సొంత కారు లేద‌ని కూడా ఆ అఫిడ‌విట్‌లో తెలిపారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌డ‌ప జిల్లాలో పులివెందుల నుంచి వైసీపీ అధినేత జ‌గ‌న్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నామినేసన్ పత్రాలను దాఖలు చేసిరు. నామినేషన్ పత్రాలతో పాటు వైసీపీ అధ్యక్షుడు జగన్, తన, తన కుటుంబసభ్యులు ఆస్తుల వివరాలతో కూడిన 47 పేజీల సుదీర్ఘ అఫిడవిట్ ను సమర్పించారు. జగన్ చ‌రాస్థులు 339 కోట్లు కాగా. త‌న స్థిరాస్తులు 35 కోట్లు అని పేర్కొన్నారు. ఇక 2014లో నామినేష‌న్ వేసిన‌ప్పుడు జ‌గ‌న్ త‌న ఆస్థి 343 కోట్లు అని పేర్కొన్నారు. జ‌గ‌న్ భార్య, వ్యాపారవేత్త వైఎస్ భార‌తీ రెడ్డి ఆస్తులు 124 కోట్లుగా ఉంది. ఇక 2014లో ఆమె ఆస్తి 71 కోట్లు ఉండేవి. భార‌తి ఆస్తుల్లో 92 కోట్లు చ‌రాస్తులు కాగా, 31 కోట్లు స్థిరాస్తిగా ఉంది.

అఫిడవిట్ లో పేర్కున్న లెక్కల ప్రకారం జగన్ ఇద్ద‌రు కూతుళ్ల‌పై 11 కోట్ల ఆస్తులు ఉన్నాయి. త‌నకు సొంత కారు లేద‌ని జ‌గ‌న్ త‌న ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో పేర్కొన్నారు. ఇత‌రుల‌కు చెందిన నాలుగు బుల్లెట్ ప్రూఫ్ కార్లు మాత్రం త‌న పేరు మీద రిజిస్ట‌ర్ అయ్యాయ‌ని తెలిపారు. 2017-18 సంవ‌త్స‌రంలో జ‌గ‌న్ త‌న ఆదాయాన్ని 25 కోట్ల 89 లక్షలుగా చూపించారు. అంత‌క‌ముందు సంవత్స‌రంలో ఆ ఆదాయం 2 కోట్ల 90 లక్షలు మాత్ర‌మే ఉన్న‌ది.

దీనితో పాటు 8 కోట్ల 42 లక్షల విలువైన వ్యవసాయ భూమి జగన్ పేరిట ఉంది. 14 కోట్ల 46 లక్షల విలువైన క‌మ‌ర్షియ‌ల్ బిల్డింగ్ 12 కోట్ల విలువైన రెసిడెన్షియ‌ల్ బిల్డింగ్‌లో హైద‌రాబాద్‌లో ఉన్నాయి. ఇక జ‌గ‌న్‌పై మొత్తం 31 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంట్లో సీబీఐ, ఈడీ, మ‌నీల్యాండ‌రింగ్ కేసులో కూడా ఉన్నాయని అఫిడవిట్ లో జగన్ వెల్లడించారు.

Next Story