logo

నా లేఖ నాకు ఇప్పించండి...ఎన్‌ఐఏ కోర్టుకు నిందితుడు శ్రీనివాస్ వినతి

Srinivas RaoSrinivas Rao

జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌రావు.. ఎన్‌ఐఏ కస్టడీ ముగియడంతో అతన్ని విజయవాడ కోర్టులో హాజరుపర్చారు. విచారణలో జడ్జి ప్రశ్నలకు నిందితుడు శ్రీనివాసరావు సమాధానాలు చెప్పారు. విచారణ సమయంలో ఎన్‌ఐఏ అధికారులు ఇబ్బందులు పెట్టారా అన్న ప్రశ్నకు అలాంటిదేం లేదని అన్నారు. అలాగే లాయర్ చెబుతున్నట్లుగా తనకు ప్రాణహాని కూడా లేదని శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. అయితే తాను జైల్లో ఉన్న సమయంలో 22 పేజీల లేఖ రాశానని దాన్ని జైలు అధికారులు లాక్కున్నారని చెప్పారు. తనకు ఆ లేఖను తిరిగి ఇప్పించాలని శ్రీనివాస్‌రావు జడ్జీని కోరారు.

లైవ్ టీవి

Share it
Top