మంత్రుల ఇళ్లే టార్గెట్.. ఐటీ దాడుల కలకలం..!

మంత్రుల ఇళ్లే టార్గెట్.. ఐటీ దాడుల కలకలం..!
x
Highlights

కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. బెంగళూరు మాండ్య, హాసన్ నియోజకవర్గాల్లోని దాదాపు 12 చోట్ల ఐటీ అధికారులు...

కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. బెంగళూరు మాండ్య, హాసన్ నియోజకవర్గాల్లోని దాదాపు 12 చోట్ల ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు భారీగా నగదు దాచి ఉంచినట్టు సమాచారం అందుకున్న ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో కర్ణాటకలో ఐటీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఓటర్లకు అధికంగా డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. జేడీఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. హాసన్ లో మూడు చోట్ల,మందిర్, మదిర్ ప్రాంతాల్లోని జేడీఎస్, కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.

శివమోగలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ నాయకుడు, మాజీ సీఎం యడ్యూరప్ప హెలికాప్టర్‌ను నిలిపివేసి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. హెలికాప్టర్‌లోని బ్యాగులను ఎలక్షన్‌ ఫ్లయింగ్ స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించింది. మరోవైపు రియల్‌ఎస్టేట్‌, క్వారీలు, ప్రభుత్వ కాంట్రాక్టులు, పెట్రోల్‌ బంక్‌లు నిర్వహించేవారు, కోఆపరేటివ్‌ బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్లు తదితరుల నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిపారు. వీరి ఆస్తులకు పన్ను చెల్లించడం లేదని ఫిర్యాదులు రావడంతో ఈ తనిఖీలు చేపట్టినట్టు ఐటీ అధికారులు చెబుతున్నారు. ఐటీ అధికారులు తనిఖీల పట్ల కర్ణాటక సీఎం కుమారస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories