కమల్ నాథ్ లక్ష్యంగా రెండో రోజూ ఐటీ సోదాలు

కమల్ నాథ్ లక్ష్యంగా రెండో రోజూ ఐటీ సోదాలు
x
Highlights

మధ్యప్రదేశ్‌ సీఎం కమల్ నాథ్ లక్ష్యంగా రెండో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఓఎస్డీ బంధువుల ఇళ్లలో ఇవాళ కూడా తనిఖీలు ఆదాయపు...

మధ్యప్రదేశ్‌ సీఎం కమల్ నాథ్ లక్ష్యంగా రెండో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఓఎస్డీ బంధువుల ఇళ్లలో ఇవాళ కూడా తనిఖీలు ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేస్తోంది. నిన్న తెల్లవారుజాము నుంచి ఎంపీ, ఢిల్లీలోని 65 ప్రాంతాల్లో కమలనాథ్ సన్నిహితుల ఇళ్లలో చేస్తున్న తనిఖీల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని 10 నుంచి 14 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ డబ్బులో కొంత కమల్‌నాథ్‌ వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో దొరికినట్లు భారీ మొత్తంలో నల్లధనాన్ని సీజ్ చేసినట్లు తెలుస్తోంది.

ఎన్నికల నేపథ్యంలో హవాలా మార్గంలో నగదు చేరవేత గురించి అనుమానాలు, పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహించినట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు. అయితే ఎన్నికల్లో లబ్ధి కోసమే బీజేపీ ఐటీ, ఈడీ దాడులకు పాల్పడుతోందని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ మండిపడ్డారు. కక్షతోనే ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories