logo

సీఎం కమల్‌నాథ్‌ ఓఎస్డీ నివాసంలో ఐటీ దాడులు

సీఎం కమల్‌నాథ్‌ ఓఎస్డీ నివాసంలో ఐటీ దాడులు

ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా ఐటీ దాడులు తీవ్రమయ్యాయి. విచ్చలవిడిగా పెద్దమొత్తంలో రవాణా అవుతోన్న నగదు పట్టుకోవడంతోపాటు ప్రముఖులు, నేతల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇండోర్‌, భోపాల్‌, గోవా, భూలా, ఢిల్లీలోని 35 ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌ సీఎం ఓఎస్‌డీ, అమిరా గ్రూప్‌, మోసర్‌ బేయర్‌లో మొత్తం 50 చోట్ల సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో 300 మందికి పైగా ఐటీ అధికారులు పాల్గొన్నారు. ఈ దాడుల్లో 9కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు.

లైవ్ టీవి

Share it
Top