డేటా వార్ చూట్టూ ఏపీ రాజకీయాలు..

డేటా వార్ చూట్టూ ఏపీ రాజకీయాలు..
x
Highlights

ఏపీ రాజకీయాలు మొత్తం డేటా చూట్టూనే తిరుగుతున్నాయి. అధికార పార్టీ ప్రమేయంతోనే డేటా చోరీ జరిగిందని వైసీపీ ఆరోపిస్తుంటే, తప్పును కప్పిపుచ్చుకునేందుకే...

ఏపీ రాజకీయాలు మొత్తం డేటా చూట్టూనే తిరుగుతున్నాయి. అధికార పార్టీ ప్రమేయంతోనే డేటా చోరీ జరిగిందని వైసీపీ ఆరోపిస్తుంటే, తప్పును కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ తమపై అసత్య ప్రచారం చేస్తోందని టీడీపీ అంటోంది. టీడీపీ టార్గెట్ గా వైసీపీ, బీజేపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశాయి.

డేటా చోరీ కేంద్రంగా ఏపీ పాలిటిక్స్ హీటెక్కాయి. టీడీపీని టార్గెట్ చేస్తూ వైసీపీ, బీజేపీ విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి. ఈ వ్యవహారం రాజ్ భవన్ కు చేరింది. ఇరుపార్టీల నేతలు గవర్నర్ ను కలిసి టీడీపీపై ఫిర్యాదు చేశాయి. సీఎం చంద్రబాబు రెండేళ్లుగా సైబర్ క్రైమ్‌కు పాల్పడుతున్నారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. పార్టీ సీనియర్ నేతలతో రాజ్‌భవన్‌కు వెళ్లిన జగన్ డేటా కుంభకోణం, ఓట్ల తొలగింపుపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. సీఎం స్థాయి వ్యక్తే, సైబర్ క్రైమ్‌కు పాల్పడితే దొంగతనం కాదా అంటూ ప్రశ్నించారు. ఓటర్ల ఐడీ డేటా, మాస్టర్ కాపీ కలర్ ఫోటోలతో సహా ఐటీ గ్రిడ్ లో ఎలా కనబడుతుందన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారం ప్రైవేట్ సంస్థలకు ఎలా అప్పగించారో చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు.

ఏపీ బీజేపీ నేతలు కూడా గవర్నర్ నరసింహన్ ను కలిసి ఐటీ గ్రిడ్స్ పై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కేంద్రం హోంమంత్రితో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఎలా అప్పగిస్తారంటూ ప్రశ్నించిన కన్నా నిందితుడిని చంద్రబాబు ఎందుకు కాపాడుతున్నారంటూ నిలదీశారు.

ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్లను తొలగించే కుట్రపై వైసీపీ నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని టీడీపీ అంటోంది. ఫారం-7 ద్వారా నకిలీ దరఖాస్తులతో ఓట్లు తొలగించే కుట్రకు వైసీపీ పాల్పడుతోందని ఆరోపిస్తోంది. ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు టీడీపీ నేతలు అన్నారు. మరోవైపు, డేటా చోరీ కేసు వివాదంలో కీలక మలుపు చోటుచేసుకోనుంది. తెలంగాణ ప్రభుత్వంపై కేసు పెట్టే యోచనలో ఏపీ టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కేసు పెట్టే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. డేటాను తెలంగాణ సర్కార్ చోరీ చేసిందని కేసు పెట్టాలని పరువు నష్టం దావా వేయాలని టీడీపీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories