Top
logo

డేటా వార్‌లో బ్లూ ఫ్రాగ్ పేరు..

డేటా వార్‌లో బ్లూ ఫ్రాగ్ పేరు..
X
Highlights

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న డేటా వార్‌లో ప్రధానంగా వినిపిస్తోన్న పేరు బ్లూ ఫ్రాగ్. విశాఖ...

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న డేటా వార్‌లో ప్రధానంగా వినిపిస్తోన్న పేరు బ్లూ ఫ్రాగ్. విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్లూ ఫ్రాగ్ టెక్నాలజీ సంస్థ సేకరించిన సమాచారం డేటా గ్రిడ్‌కు చేరిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.డేటా వార్‌లో విశాఖలోని బ్లూ ఫ్రాగ్ టెక్నాలజీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. జన్మభూమి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తుల తనిఖీలు, అర్హులను ప్రకటించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థకు అప్పగించింది. దీంతో కుటుంబ వికాసం - సమాజ వికాసం పథకానికి సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి పైనలైజ్ చేసి, ఆ సమాచారాన్ని డేటా గ్రిడ్‌కు ఈ సంస్థ చేరవేస్తుంది.

అయితే, తాజాగా డేటా చోరీపై రెండు రాష్ట్రాల్లో వివాదం నడుస్తుండటంతో ఈ బ్లూ ఫ్రాగ్ టెక్నాలజీ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ సంస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ పోలీసుల ఆరోపణలు, సందేహాలపై అనేక అపోహలకు దారి తీస్తున్నాయి. ఏపీ డేటా చోరీ వ్యవహారంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ, అధికార, ప్రతిపక్ష పార్టీల్లోనూ జరుగుతున్న పరిణామాలు ఎటు దారితీస్తాయోనన్నది ఉత్కంఠగా మారింది.

Next Story