పీఎస్‌ఎల్వీ సీ46 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

పీఎస్‌ఎల్వీ సీ46 కౌంట్‌డౌన్‌ ప్రారంభం
x
Highlights

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్ఎల్వీ సీ46 ద్వారా రీశాట్-2బీర్1ను బుధవారం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్...

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్ఎల్వీ సీ46 ద్వారా రీశాట్-2బీర్1ను బుధవారం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి కక్షలోకి ప్రవేశపెట్టనుంది. రేపు ఉదయం 5.30గంటలకు పీఎస్‌ఎల్వీ సీ46 ప్రయోగం జరగనుంది. 615 కిలోల బరువున్న రీశాట్‌-2 బీఆర్‌1 ఉపగ్రహాన్ని ఈ రాకెట్‌ మోసుకెళ్లనుంది. రీశాట్‌-2 బీఆర్‌1 ఉపగ్రహం కాలపరిమితి ఐదేళ్లు ఉంటుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దేశ సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలు, వారి కదలికలపై నిశిత దృష్టి సారించే రీశాట్‌-2బీ ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఆ సమయంలో అంతరిక్షంలో వ్యర్థాలు అడ్డు రానుండడాన్ని గుర్తించి మూడు నిమిషాల అలస్యంగా 5.30 గంటలకు చేపట్టాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.





Show Full Article
Print Article
Next Story
More Stories