logo

మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం

ఇస్రో మరో వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. అంతరిక్షంలో నిర్ణీత కక్ష్యలో ఉపగ్రహాన్ని విడిచిపెట్టే రాకెట్‌లోని నాలుగో దశను రోదసిలోనే ఆరు నెలలపాటు ఉండేలా నియంత్రించనుంది.

మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం

ఇస్రో మరో వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. అంతరిక్షంలో నిర్ణీత కక్ష్యలో ఉపగ్రహాన్ని విడిచిపెట్టే రాకెట్‌లోని నాలుగో దశను రోదసిలోనే ఆరు నెలలపాటు ఉండేలా నియంత్రించనుంది. ఇందుకోసం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన నాలుగో దశతో పీఎస్‌ఎల్వీ-డీఎల్‌ రాకెట్‌ను రూపొందించి తొలిసారి వినియోగిస్తున్నారు. షార్‌లోని ప్రథమ ప్రయోగ వేదికపై పీఎస్‌ఎల్వీ-సీ44 రాకెట్‌ ఈ ప్రయోగానికి సిద్ధంగా ఉంది. గురువారం రాత్రి 11.38 గంటలకు దేశీయ ఇమేజింగ్‌ ఉపగ్రహం మైక్రోశాట్‌-ఆర్‌తో ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకుపోనుంది. కేవలం 13.13 నిమిషాలలోనే 277 కిలోమీటర్ల ఎత్తుకు రాకెట్‌ చేరి ఉపగ్రహాన్ని వదిలిపెట్టనుంది.

లైవ్ టీవి

Share it
Top