logo

ఐఎన్‌ఎక్స్‌ లంచం కేసులో కీలక పరిణామం

ఐఎన్‌ఎక్స్‌ లంచం కేసులో కీలక పరిణామం

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి చిక్కులు తప్పేలా లేవు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా లంచం కేసులో అప్రూవర్‌గా మారడానికి మరో నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా సిద్ధమైంది. ప్రస్తుతం ముంబై బైకుల్లా జైలులో ఉన్న ఇంద్రాణి ముఖర్జియా వీడియో లింక్ ద్వారా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు నుంచి బయటపడడానికి కార్తి చిదంబరానికి చేస్తున్న ప్రయత్నాలకు చుక్కెదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఐఎన్‌ఎక్స్‌ కేసులో కార్తీ చిదంబరం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయనను ఈడీ విచారిస్తోంది.

లైవ్ టీవి

Share it
Top