డాక్టర్‌ అంకుల్‌.. ఈ కోడిపిల్లకు చికిత్స చేయండి... ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ఫోటో

డాక్టర్‌ అంకుల్‌.. ఈ కోడిపిల్లకు చికిత్స చేయండి... ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ఫోటో
x
Highlights

చిన్న పిల్లలు దేవుళ్లతో సమానం అని పెద్దవాళ్లు చెబుతుంటారు. చిన్నపిల్లల మనసులు స్వచ్ఛమైనవి వారికి అమాయకత్వం పెట్టని ఆభరణం ఇలాంటి రచనలు ఎన్నో...

చిన్న పిల్లలు దేవుళ్లతో సమానం అని పెద్దవాళ్లు చెబుతుంటారు. చిన్నపిల్లల మనసులు స్వచ్ఛమైనవి వారికి అమాయకత్వం పెట్టని ఆభరణం ఇలాంటి రచనలు ఎన్నో పుస్తకాల్లో, కవితల్లో చదువుతూ ఉంటాం. అయితే తాజాగా పై వ్యాఖ్యాలకు మిజోరంలో చోటుచేసుకున్న ఈ ఘటనే నిదర్శనం అని చెప్పవచ్చు. కార్లలో రయ్‌మని రువ్వడి మీద పొతూ అడ్డువచ్చిన ఢీకొట్టి వెళ్లిపోయే వారి గురించి తరచూ చూస్తూ, వింటునే ఉంటాం. అయితే ఓ ఆరేళ్ల బాలుడు చేసిన పనికి ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇక వివారాల్లోకి వెళితే మిజోరాంలోని సైరంగ్‌కు చెందిన డెరెక్‌ లాల్‌చన్‌హిమా అనే ఆరేళ్ల పిల్లాడు రోజూలాగే ఆడుకోవడానికి తన సైకిల్‌పై స్వారీకి వెళ్లాడు. ఈ క్రమంలోనే తన సైకిల్ కి ఎదురొచ్చిన కోడిపిల్ల సైకిల్‌ కింద పడింది. దీంతో డెరెక్‌ లాల్‌చన్‌హిమా హుటాహుటినా తన ఇంటికి వెళ్లి తన తండ్రికి జరిగిన విషయాన్ని చెప్పి వెంటనే ఈ కోడిపిల్లను ఆస్పత్రికి తీసుకువెళ్లాలని పట్టుబట్టాడు. అయితే పాపం ఆ పిల్లవాడికి అప్పటికే కోడిపిల్ల చనిపోయిందన్న విషయం తెలియదు. పిల్లడికి తండ్రి చెప్పిన కానీ వినకుండా తన కిడ్డీబ్యాంకులో ఉన్న 10 రూపాయలు తీసుకుని తానే స్వయంగా ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యునికి జరిగిందంతా క్లుప్తంగా వివరించాడు. డెరెక్‌ అమాయత్వం చూసిన అక్కడి నర్స్‌ తన అమాయకత్వాన్ని చూసి వెంటనే డెరెక్‌ ఫొటో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఇక దీనిపై స్పందించిన నెటిజన్లు ఒక్కరు ఒక్కోతీరుగా ప్రశంసలు కురిపించారు. ఒకరేమో నీదెంత మంచి మనసురా చిన్నోడా. ఎంతో మంది పెద్ద వాళ్ల కంటే కూడా గొప్పగా ఆలోచించావు. దేవుడు నిన్ను చల్లగా చూడాలి. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో దూమ్మురేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories