కావలిలో కాకరేపుతోన్న ఇద్దరు మాజీలు...సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పావులు

కావలిలో కాకరేపుతోన్న ఇద్దరు మాజీలు...సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పావులు
x
Highlights

గత ఎన్నికల్లో వాళ్లిద్దరి సహకారంతోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం వాళ్లిద్దరే టికెట్‌ రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. తమ ఇద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

గత ఎన్నికల్లో వాళ్లిద్దరి సహకారంతోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం వాళ్లిద్దరే టికెట్‌ రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. తమ ఇద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మళ్లీ ఆ ఎమ్మెల్యేకు టికెట్‌ ఇస్తే సహకరించేది లేదని హైకమాండ్‌‌కు తెగేసి చెబుతున్నారు. సింహపురి వైసీపీ రాజకీయాల్లో కాకరేపుతోన్న ఇద్దరు మాజీలపై స్పెషల్ స్టోరీ.

సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే నెల్లూరు జిల్లా కావలి ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ కావలి టిక్కెట్ కోసం ఇద్దరు మాజీలు కాటంరెడ్డి విష్ణువర్దన్ రెడ్డి, వంటేరు వేణుగోపాల్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ప్రకారం తనకే టిక్కెట్ ఇవ్వాలని అల్లూరు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి జగన్ ను కోరుతుండగా తనకే టిక్కెట్ ఇవ్వాలని మరో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి పట్టుపడుతున్నారు. దాంతో ఈ ఇద్దరు మాజీల ప్రయత్నాలు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి తలనొప్పిగా మారాయట.

2014 ఎన్నికల్లో ప్రత్యర్ధి బీద మస్తాన్‌‌రావుపై వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి స్వల్ప మెజార్టీతో గటెక్కారు. ఆ ఎన్నికల్లో రామిరెడ్డి గెలుపు కోసం విష్ణువర్దన్ రెడ్డి, వంటేరు కృషిచేశారు. వారిద్దరి వల్లే రామిరెడ్డి గెలిచారని, లేకపోతే మస్తాన్‌రావు చేతిలో ఓటమి చవిచూసేవారని చెప్పుకుంటారు. అయితే ఎన్నికల తర్వాత కాటంరెడ్డి విష్ణువర్దన్ రెడ్డి, వంటేరు వేణుగోపాల్ రెడ్డితో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి దూరం పెరుగుతూ వచ్చింది. అయితే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఇద్దరూ ఒక్కటయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఈసారి రామిరెడ్డికి టికెట్‌ ఇస్తే సహకరించకూడదని నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తమ ఇద్దరిలో ఎవరికి సీటిచ్చినా కలిసికట్టుగా పనిచేస్తామని విష్ణు, వంటేరు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.

త్వరలోనే జగన్‌ను కలవాలని నిర్ణయించుకున్న కాటంరెడ్డి విష్ణువర్దన్ రెడ్డి, వంటేరు వేణుగోపాల్ రెడ్డిలు తమలో ఎవరో ఒకరికి టికెట్‌ ఇవ్వాలని కోరనున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ జగన్ సానుకూలంగా స్పందించకపోతే రామిరెడ్డికి వ్యతిరేకంగా పనిచేసేందుకు ఇద్దరు మాజీలు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories