తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా
x
Highlights

తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే మే 16 నుంచి జరగాల్సిన పరీక్షలు మే 25 తేదీకి వాయిదా వేస్తున్నట్లు...

తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే మే 16 నుంచి జరగాల్సిన పరీక్షలు మే 25 తేదీకి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మే 25వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. జూన్ 7వ తేదీ నుంచి జూన్ 10 తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ ప్రయోగపరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షకు దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది. ఇక ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాల రీవెరిఫికేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.ఈ మేరకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తాత్కాలిక టైమ్ టేబుల్‌ను ఆదివారం విడుదల చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories