మహిళలే మహరాణులు

మహిళలే మహరాణులు
x
Highlights

2019 ఎన్నికలు మహిళా శక్తిని చాటనున్నాయా? పార్టీలన్నీ మహిళలను ఓటు బ్యాంకులుగా గుర్తిస్తున్నాయి. మేనిఫెస్టోలో ప్రత్యేక కేటాయింపులే కాదు సీట్లు కూడా...

2019 ఎన్నికలు మహిళా శక్తిని చాటనున్నాయా? పార్టీలన్నీ మహిళలను ఓటు బ్యాంకులుగా గుర్తిస్తున్నాయి. మేనిఫెస్టోలో ప్రత్యేక కేటాయింపులే కాదు సీట్లు కూడా పెద్ద ఎత్తున కేటాయిస్తూ మహిళల ప్రాధాన్యతను పెంచుతున్నాయి. మహిళలపై ఈ ప్రేమ నిజంగానే ఉంటుందా?ఎన్నికల మురిపెమా?

మహిళా శక్తి అజేయ శక్తిగా గుర్తిస్తున్నాయి రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా పరిగణించడమే కాదు వారి వికాసానికీ, పురోగతికి బాటలు వేస్తున్నాయి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సారి ఎన్నికల్లో మహిళలకు 41 శాతం సీట్లను కేటాయించారు. మోడీ హటావో దేశ్ బచావో అంటున్న మమత బెంగాల్ లో అన్ని స్థానాలను తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహిళలే దేశానికి మంచి పాలన అందించగలరని మమతా కామెంట్ చేస్తున్నారు 42 ఎంపీ సీట్లున్న పశ్చిమ బెంగాల్ లో 17 మంది మహిళలకు పోటీ చేసే అవకాశం కల్పించారు మమత 2014 ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో 20 మంది కొత్త అభ్యర్ధులున్నారు. ఇక తృణమూల్ నుంచి పోటీకి దిగుతున్న వారిలో 5 మంది సినీ రంగానికి చెందిన వారున్నారు.

తృణమూల్ మాజీ ఎంపీ, నటి మున్ మున్ సేన్ ఈసారి ఆసన్ సోల్ నియోజక వర్గం నుంచి బరిలో దిగుతున్నారు బీజేపీ నుంచి గాయకుడు, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో పోటీ చేస్తున్నారు. ఈసారి గూర్ఖా జనముక్తి మోర్ఛా తృణమూల్ కు మద్దతు పలుకుతుండటం విశేషం.అస్సాం, జార్ఖండ్, బీహార్, అండమాన్ లలో సైతం తృణమూల్ పోటీకి దిగుతుందని మమతా చెబుతున్నారు.

ఇటు మమతా బెనర్జీకి దీటుగా ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ కూడా పార్టీలో మహిళలకు 33 శాతం టిక్కెట్లు కేటాయిస్తామని ప్రకటించారు కేంద్రపరలోని ఓ మహిళా సంఘం సమావేశానికి హాజరైన నవీన్ 33 శాతం మహిళా ఎంపీలను పార్లమెంటుకు పంపాలన్నది తన తండ్రి ఆశయమన్నారు. మహిళా సాధికారతలో ఒడిసాకు ప్రత్యేక స్థానముందన్నారు అమెరికా, చైనాల స్థాయిని భారత్ చేరుకోవాలంటే మహిళా సాధికారతతోనే సాధ్యమని నవీన్ పట్నాయక్ అంటున్నారు. మహిళా సాధికారత పై మాట్లాడే పార్టీలు దానిని ఆచరణలో పెట్టాలని నవీన్ పట్నాయక్ అంటున్నారు.

వీరిద్దరే కాదు కాంగ్రెస్ యువతేజం రాహుల్ కూడా 33% కోటాపై మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ప్రభుత్వోద్యోగాలలో33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. 2019 ఎన్నికల్లో తాము గెలిస్తే తాను సంతకం పెట్టే తొలిఫైల్ ఇదేనని రాహుల్ అన్నారు. తమిళనాడు కన్యాకుమారి జిల్లాలోని నాగర్ కోయిల్ లో ఓ బహిరంగ సభలో రాహుల్ ప్రభుత్వోద్యోగాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించినా ఆ తర్వాత చెన్నయ్ మీడియా కాన్ఫరెన్స్ లో చట్ట సభల్లోనూ 33 శాతం రిజర్వేషన్ కల సాకారమయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

పార్టీల మాటెలా ఉన్నా మహిళల ఓటింగ్ రాను రాను పెరుగుతోంది. దేశంలోని 29 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాల్లో మగవారికన్నా మహిళలే ఎక్కువగా ఓటు వేశారు. 2014 ఎన్నికల్లో దాదాపు 26 కోట్ల మంది మహిళలు ఓటింగ్ లో పాల్గొన్నారు. మగవారి ఆధిపత్యం సాగుతున్న రాజకీయ రంగంలో మహిళలూ ఇప్పుడిప్పుడే చొరవ చూపి నేతలుగా పోటీ చేసి గెలుస్తున్నారు చట్ట సభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరిగితే మహిళల సమస్యలు తీరే అవకాశముంటుంది ప్రజా భద్రత, శానిటేషన్, ఆరోగ్యం, పరిశుభ్రత లాంటి రంగాలపై మహిళలు పెట్టినంత దృష్టి మగవారు పెట్టలేరు.

ఓటేయడం సామాజిక బాధ్యతగా భావించి మహిళలు ఎక్కువగా ఓటు చేస్తే దేశ పరిస్థితులే మారిపోతాయి. అనేక రంగాల్లో పాతుకుపోయిన సామాజిక వివక్షను తొలగించడానికి మహిళా ఓటర్లే కీలకం అవుతారు. బాలికా విద్యను ప్రోమోట్ చేయడానికి, మహిళలపై పెరుగుతున్న దాడులను నిరోధించడానికీ, మహిళలే చట్టసభల్లో ఎక్కువ సంఖ్యలో ఉండి కీలక బాధ్యతలు తీసుకుంటే సమస్యలను రూపు మాపవచ్చు. మన దేశంలో ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 908 మంది మహిళా ఓటర్లు మాత్రమే ఉన్నారు.

542 మంది సభ్యులున్న లోక్ సభలో మహిళల ప్రాతినిధ్యం కేవలం 11.6 శాతం 245 మంది సభ్యులున్న రాజ్యసభలో మహిళల ప్రాతినిధ్యం కేవలం 11 శాతం మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా193 దేశాలలో రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యం విషయంలో భారత్ 148 స్థానంలో ఉంది. ఎన్నికల్లో మహిళలు పాల్గొని పెద్ద ఎత్తున ఓటు వేసే దిశగా ఎన్నికల సంఘం కూడా పనిచేస్తోంది. మహిళల కోసం డిమాండ్ ను బట్టి ప్రత్యేక బూత్ లు పెడుతోంది.

మహిళలు కూడా తమ వంతుగా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. అర్హులైన ప్రతీ మహిళ తమ ఓటును నమోదు చేసుకోవడం, ఓటు వేయడం తమ బాధ్యతగా భావించాలి మహిళలు చేయి చేయి కలిపి అడుగేస్తే మహిళా సాధికారత ఎంతో దూరంలో లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories