వీసా స్కాంలో అమెరికాకు భారత్ నిరసన..డీమార్ష్‌లో కోరిన విదేశాంగ శాఖ..

వీసా స్కాంలో అమెరికాకు భారత్ నిరసన..డీమార్ష్‌లో కోరిన విదేశాంగ శాఖ..
x
Highlights

వీసా కుంభకోణంలో దాదాపు 129 మంది విద్యార్థులను అమెరికా ప్రభుత్వం నిర్బంధించడంపై భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. తన నిరసనతో కూడిన విజ్ఞప్తిని ...

వీసా కుంభకోణంలో దాదాపు 129 మంది విద్యార్థులను అమెరికా ప్రభుత్వం నిర్బంధించడంపై భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. తన నిరసనతో కూడిన విజ్ఞప్తిని అమెరికా దౌత్య కార్యాలయానికి పంపింది. ''పే అండ్‌ స్టే'' స్కాంలో ఇరుక్కున్న వారిని రక్షించడమే తమకిపుడు అత్యధిక ప్రాధాన్యాంశమని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ప్రకటించింది. ''నిర్బంధంలో ఉన్న విద్యార్థుల బాగోగులతోపాటు వారితో భారతీయ దౌత్యాధికారులు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరినట్లు'' విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఆ నకిలీ యూనివర్సిటీ ఉన్నది అమెరికా గడ్డపైనేనని, దరఖాస్తు చేసి మోసపోయినవారు భారతీయ విద్యార్థులు. వారిని మోసం చేసింది రిక్రూటర్లు. ఆ మోసగాళ్లతో సమానంగా విద్యార్థులను చూడొద్దని విదేశాంగశాఖ పేర్కొంది. మోసానికి పాల్పడ్డ వారిని పరిగణించేట్లు వీరిపై చర్యలు తీసుకోరాదని, ఆ విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని భారత్‌ కోరింది. వారి అంగీకారం లేకుండా వారిని బలవంతంగా స్వదేశానికి తిరిగి పంపించొద్దని అని అమెరికన్‌ ప్రభుత్వాన్ని కోరినట్లు ఆ ప్రకటన వెల్లడించింది.

భారత విదేశాంగ శాఖ అధికారులు అక్కడ విద్యార్థులను సంప్రదించే పనిలో ఉన్నారని, ఇప్పటికే 30 మంది తమ సాయం కోరారని విదేశాంగశాఖ తెలిపింది. అమెరికాలో ఉన్న భారతీయ సంఘాలు కూడా లాయర్లను ఏర్పాటు చేస్తున్నాయని, వివరాలు ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వంతో పంచుకోవాలని అమెరికాకు చెప్పినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. డిటెన్షన్ కేంద్రాలను దౌత్యాధికారులు సందర్శిస్తున్నారని, న్యాయ సహకారం కోరిన వారికి సహకారం అందించడానికి అక్కడి భారతీయులను సమీకరిస్తున్నామని విదేశాంగ శాఖ వివరించింది. విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా మిగిలిన వ్యవహారాలను పక్కనపెట్టి దీన్నొక్కటే చేపట్టాలని ఎంబసీని ఆదేశించామని తెలిపింది.

నిర్బంధంలోని విద్యార్థులకు సంబంధించిన వివరాలు, సందేహాల కోసం వాషింగ్టన్‌ డీసీలోని భారత రాయబార కార్యాలయంలో 24 గంటల హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వివరాల కోసం టెలిఫోన్‌ నెంబర్లు +12023221190, +12023402590, ఈ-మెయిల్‌ ద్వారా సంప్రదించాలని సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories