క్రికెట్ అభిమానులు మరిచిపోలేని రోజు ఇది ..

క్రికెట్ అభిమానులు మరిచిపోలేని రోజు ఇది ..
x
Highlights

1983 వరల్డ్ కప్ .. ఇండియా జట్టు ఇంగ్లాండ్ లో జరిగిన వరల్డ్ కప్ ని గెలుచుకున్న రోజు ఇది .. ఈ రోజుతో 36 సంవత్సరాలు నిండాయి ..ఇప్పటి వారికి ఇది అంత...

1983 వరల్డ్ కప్ .. ఇండియా జట్టు ఇంగ్లాండ్ లో జరిగిన వరల్డ్ కప్ ని గెలుచుకున్న రోజు ఇది .. ఈ రోజుతో 36 సంవత్సరాలు నిండాయి ..ఇప్పటి వారికి ఇది అంత గొప్ప విషయం కాకపోవచ్చు. కానీ అప్పుడు ఇది ఒక వండర్ అనే చెప్పాలి ... ప్రపంచ కప్ ఆడేందుకు ఇండియన్ టీం ఇంగ్లాండ్ కి బయలు దేరింది .. ఎవరికీ కూడా ఇండియా జట్టు పైన అంత అంచనాలు లేవు .. కప్ గెలవడం ఏమో కానీ పరువు నిలబెట్టుకుంటే చాలు అనుకున్నా వాళ్ళు అబ్బో చాలానే ఉన్నారు .. అందుకు తగ్గట్టు కానే ఇండియన్ టీం కూడా మొదటి మ్యాచ్ లోనే ఓడిపోయింది ..

కానీ ఎక్కడ కూడా తమ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఇండియా మిగతా జట్లను ఓడించి అంచనాలను తారుమారు చేస్తూ వరల్డ్ కప్ ఫైనల్ లో నిలిచింది .. ఫైనల్ లో ఆడేది వెస్టిండిస్ జట్టుతో కావడంతో భారత అభిమానుల్లో కూడా మ్యాచ్ గెలుస్తుందా లేదా అన్న అనుమానం కూడా మొదలయింది .. మొదటగా టాస్ గెలిచినా అప్పటి విండిస్ కెప్టెన్ బౌలింగ్ ని తీసుకున్నాడు .. మొదటగా బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు 54.4 ఓవర్లకు గాను 183పరుగులు చేసింది ..

లక్ష్య చేధనకి దిగిన విండిస్ బాట్స్ మెన్స్ ని ఇండియన్ బౌలర్లు అయిన మదన్ లాల్ మరియు మహిందర్ అమర్ నాద్ తమ అద్బుతమైన బౌలింగ్ తో విండిస్ ని 140 పరుగులకే ఆలౌట్ చేసారు .. దీనితో మొదటిసారిగా ఇండియా వరల్డ్ కప్ సాధించింది .. కప్ తో స్వదేశానికి తిరిగి వచ్చిన కపిల్ టీం కి అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ గ్రాండ్ వెల్ కమ్ పలికారు .. అ తర్వాత భారత జట్టు 2011 లో ధోని సారధ్యంలో వరల్డ్ కప్ ని గెలుచుకుంది .. ప్రస్తుతం కోహ్లి సారధ్యంలోని టీం ఇండియా వరల్డ్ కప్ ని ఆడుతుంది .. ఈ కప్పు కూడా ఇంగ్లాండ్ లోనే జరుగుతుండడం మరో విశేషం .. ఈ కప్ ని భారత్ గెలుచుకోవాలని మనం కూడా ఆశిద్దాం ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories