భారత్‌ చేరిన మన పైలట్‌ అభినందన్‌

భారత్‌ చేరిన మన పైలట్‌ అభినందన్‌
x
Highlights

వచ్చేశాడు వీరుడు వచ్చేశాడు మాతృభూమిపై అడుగుపెట్టాడు. పాకిస్థాన్ చెర నుంచి విడుదలైన ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ విక్రం అభినందన్ సరిగ్గా రాత్రి 9.22కి...

వచ్చేశాడు వీరుడు వచ్చేశాడు మాతృభూమిపై అడుగుపెట్టాడు. పాకిస్థాన్ చెర నుంచి విడుదలైన ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ విక్రం అభినందన్ సరిగ్గా రాత్రి 9.22కి సొంతగడ్డపై కాలు మోపాడు. వాఘా సరిహద్దు దగ్గర అభినందన్ కు స్వాగతం పలికిన BSF అధికారులు ఆయనకు ఆప్యాయంగా స్వాగతం పలికారు. BSF అధికారులకు షేక్ హ్యాండ్ ఇచ్చిన అభినందన్ ను వారు హత్తుకుని దగ్గరకు తీసుకున్నారు.

భారతీయులు ఉద్విగ్నంగా ఎదురు చూసిన క్షణాలు రానే వచ్చాయి. అందరి ప్రార్ధనలు ఫలించి వింగ్ కమాండర్ అభినందన్ పాక్ సరిహద్దు నుంచి ఇండియన్ పాయింట్ దగ్గరకు చేరుకున్నారు. పాక్ జవాన్ల పహారాలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు కనిపించడంతో వాఘా సరిహద్దు దగ్గర హర్షధ్వానాలు మిన్నంటాయి. జయహో అభినందన్, జై జవాన్ అనే నినాదాలతో ఆప్రాంతం మార్మోగింది.

పాక్ అధికారులు అభినందన్ ను అట్టారి బోర్డర్ దగ్గరికి సరిగ్గా 9.19కి తీసుకు వచ్చారు. పాక్ జవాన్లతో పాటు భారత ఎయిర్ ఫోర్స్ అధికారులు తోడు రాగా చిరునవ్వులు చిందిస్తున్న అభినందన్ విజువల్స్ ని పాకిస్థాన్ మీడియా ప్రసారం చేసింది. పాక్ వాసులు కొట్టిన దెబ్బలు బాధపెడుతున్నా కుడి కంటి గాయం వేధిస్తున్నా ఆ నొప్పి తాలుకు బాద ఆయనలో ఎక్కడా కనిపించలేదు. స్వదేశంలో అడుగుపెడుతున్న ఆనంద క్షషణాల్లో అభినందన్ మోహముపై చిరునవ్వు ఏమాత్రం చెక్కు చెదరలేదు.

అనుకున్న షెడ్యూల్ కు ఆరు గంటలు ఆలస్యంగా పాక్ అధికారులు ఇమ్మిగ్రేషన్ పత్రాలను BSF అధికారులకు అందచేశారు. వాఘా సరిహద్దు దగ్గర ఇండో- పాక్ అధికారులు అప్పగింత పత్రాలను పరస్పరం మార్చకున్న తర్వాత అభినందన్ మన సరిహ్దుద వైపు కదిలారు. ఆయన మెల్లగా నడుచుకుంటూ వచ్చి BSF అధికారులకు కరచాలనం చేశారు. పాక్ చెరలో ధీరత్వాన్ని ప్రదర్శించిన అభినందన్ కు ఆర్మీ అధికారులు సాదరంగా ఆహ్వానం పలికారు. ఆయన్న వైద్య పరీక్షలతో పాటు పాక్ బందీగా ఉన్నప్పుడు ఎదురైన అనుభవాల గురించి ఆరా తీయడానికి ఢిల్లీ తీసుకెళ్ళారు.







Show Full Article
Print Article
Next Story
More Stories