ప్రపంచకప్‌లో భారత్‌,పాక్ మధ్య హైఓట్లేజ్ మ్యాచ్

ప్రపంచకప్‌లో భారత్‌,పాక్ మధ్య హైఓట్లేజ్ మ్యాచ్
x
Highlights

ఆ మ్యాచ్ ఉందంటే టికెట్ల కోసం అభిమానులు క్యూ కడతారు. ఎప్పుడూమ్యాచ్ చూడని వారు కూడా టీవీలకు అతుక్కు పోతారు.. రోడ్లు ఖాళీగా కనిపిస్తాయి. మ్యాచ్ జిరిగే...

ఆ మ్యాచ్ ఉందంటే టికెట్ల కోసం అభిమానులు క్యూ కడతారు. ఎప్పుడూమ్యాచ్ చూడని వారు కూడా టీవీలకు అతుక్కు పోతారు.. రోడ్లు ఖాళీగా కనిపిస్తాయి. మ్యాచ్ జిరిగే స్టేడియాలు జనాలతో నిండిపోతాయి. ఆటగాళ్లు, అభిమానులు దాన్ని యుద్ధంలా భావిస్తారు.. గేమ్ కంటే భావోద్వేగాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఆటకుండే క్రేజ్ టోర్నీకుండే రేంజ్ ఒక్కసారిగా పీక్స్ కి వెళ్తాయి. 23 అడుగుల పిచ్‌పై 22 మంది యుద్ధం చేస్తునట్లు ఉంటుంది పోరు వరల్డ్‌కప్‌లో హైఓల్టేజ్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మాంచెస్టర్‌లో మజా చేయాలని దాయాదులు సిద్ధమయ్యారు.

ప్రపంచ క్రికెట్‌లో ఫార్మేట్‌ ఏదైనా భారత్‌,పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు.. చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే ఈ పోరును అటు అభిమానులు, ఇటు ఆటగాళ్ళు యుధ్ధంలా భావిస్తారు. ఆట కంటే భావోద్వేగాలకే ఈ మ్యాచ్‌లో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుత ప్రపంచ కప్‌లో కూడా భారత్‌,పాక్ మధ్య పోరు హైలైట్‌గా నిలవబోతోంది. టోర్నీ షెడ్యూల్ ప్రకటించినప్పుడే టిక్కెట్ల కోసం అభిమానులు క్యూ కట్టారు. ఇరుదేశాల్లో ని అభిమానులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి కొన్ని గంటల్లో మాంచెస్టర్‌లో దాయాదుల పోరు జరగనుంది. ఇక రికార్డుల పరంగా ప్రపంచకప్‌లో ఎప్పుడు చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ జరిగినా భారత్‌దే పైచేయిగా నిలుస్తోంది. 1992 నుండి 2015 ప్రపంచకప్‌ వరకు భారత్‌, పాక్‌లు ఆరుసార్లు తలపడగా.. ఆరుసార్లు భారతే విజేతగా నిలిచింది. ఈసారి కూడా టీమిండియానే పాక్‌పై మ్యాచ్‌లో ఫేవరెట్‌. ఒక పక్క కోహ్లి గ్యాంగ్ పాక్‌పై ఏడో విజయం నమోదు చేయాలని చూస్తుంటే మరోపక్క ఈ సారి తమదే విజయమంటోంది దాయాదిదేశం.

టోర్నీలో తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఓడిన పాకిస్థాన్ రెండో మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై భారీ విజయం సాధించింది.. ఇక శ్రీలంకతో జరిగిన మూడో మ్యాచ్ రద్దు కాగా ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గో మ్యాచ్ లో ఓటమి చవిచూసింది. మరోవైపు తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికాను ఓడించిన ఇండియా రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియాను మట్టి కరిపించి ఫుల్ జోష్ మీద ఉంది న్యూజిలాండ్ తో పోరు వర్షం కారణంగా రద్దయింది. ఆటగాళ్ల విషయానికి వస్తే పాక్ ఆటగాళ్లు మహ్మద్ హఫీజ్, బాబర్ ఆజం, కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌లు ఫామ్‌లో ఉన్నారు.. ఫఖర్ జమాన్, ఆసిఫ్ అలీ, షోయబ్ మాలిక్‌‌లు బ్యాటు జులిపించేందుకు సిద్ధమవుతున్నారు.. ఇక బౌలింగ్‌లో వహాబ్ రియాజ్, మహ్మద్ అమీర్, షాదాబ్ ఖాన్‌‌లు ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్‌లో రాణించారు. ముఖ్యంగా మహ్మద్ అమీర్ టోర్నీలో తక్కువ ఎకానమీతో పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీశాడు.

భారత ఆటగాళ్ల విషయానికి వస్తే సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ సెంచరీ చేసి సత్తా చాటాడు. ఇక ఆస్ట్రేలియాపై జరిగిన రెండో మ్యాచ్‌లో కూడా ఆఫ్ సెంచరీతో అదరగొట్టాడు. మరో ఓపెనర్ ధావన్ తొలి మ్యాచ్‌లో తడబడ్డా ఆస్ట్రేలియా మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిపోయాడు.. అయితే చేతి వేలి గాయంతో ధావన్ పాకిస్థాన్ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. దీంతో రోహిత్‌తో పాటు ఓపెనర్‌గా రాహుల్ రానున్నాడు అయితే ఈ జోడీ ఎలా ఆడుతుంది. శుభారంభం ఇస్తుందా లేదా అన్న టెన్షన్ అభిమానుల్లో ఉంది.

కెప్టెన్ విరాట్ కోహ్లి, పాండ్యా, ధోనీలు ఆస్ట్రేలియా మ్యాచ్‌తో ఫామ్ ను అందుకోవడం భారత్‌కు కలిసొచ్చే అంశం.. బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్, బూమ్రాలు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. టోర్నీలో ఇద్దరూ ఇప్పటి వరకూ చెరో ఐదు వికెట్లు పడగొట్టారు.. ఇక బూమ్రా తక్కువ పరుగులు ఇచ్చి పొదుపుగా బౌలింగ్ వేస్తూ ప్రత్యర్థులను భయపెడుతున్నారు. ఈ బౌలింగ్ జోడీ శుభారంభం ఇస్తే టీమిండియాకు తిరుగుండదు వీరికి తోడుగా ఆల్‌రౌండర్ పాండ్యా బౌంసర్లతో భయ పెడుతున్నాడు. ఇక స్పిన్ విషయానికి వస్తే చాహల్, కులదీప్‌లతో భారత బలంగా కనిపిస్తోంది. వీరందరూ కలిసి సమిష్టిగా రాణిస్తే పాక్ కు కష్టాలు తప్పవు. ఏది ఏమైదనా అంచనాలు ఎలా ఉన్నా దాయాదుల పోరు కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories