కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న పార్టీలు...ఈసీ షెడ్యూల్ వచ్చే ముందురోజు వరకూ...

కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న పార్టీలు...ఈసీ షెడ్యూల్ వచ్చే ముందురోజు వరకూ...
x
Highlights

130 కోట్ల మంది భారతీయులకు సేవ చేయడానికి ఏకంగా వేలల్లో పార్టీలున్నాయి రాష్ట్రాల వారీగా , ప్రాంతీయ కారణాలతో ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నాయి ప్రజాసేవకోసమే...

130 కోట్ల మంది భారతీయులకు సేవ చేయడానికి ఏకంగా వేలల్లో పార్టీలున్నాయి రాష్ట్రాల వారీగా , ప్రాంతీయ కారణాలతో ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నాయి ప్రజాసేవకోసమే అని పార్టీలొస్తున్నా ప్రజలు మాత్రం ఇంకా కనీసావసరాలు దొరక్క ఇబ్బందులు పడుతూనే ఉన్నారు రాష్ట్రాల్లో ఇలా నామ్ కే వాస్తే పార్టీలతో ఒరిగేదేంటి?అసలు ఈసీ దగ్గరున్న పార్టీల చిట్టా ఏం చెబుతోంది.

ప్రజాసేవ చేయాలంటే రాజకీయమే దగ్గర దారా? పార్టీ పెట్టకుండా ప్రజలకు సేవ చేయలేమా? దేశంలో వేలల్లో పార్టీలు పుట్టుకొస్తున్నా ప్రజల జీవన స్థితి గతులు మాత్రం మారడం లేదు. కొన్ని పార్టీల పేర్లు కూడా కనీసం ఎవరికీ తెలియదు శతాధిక వయసున్న పార్టీల నుంచి ఎన్నికలకు జస్ట్ ఒకరోజు ముందు ఏర్పాటైన పార్టీలతో కలుపుకుని మనదేశంలో దాదాపు 2,300 రాజకీయ పార్టీలున్నట్లు ఎన్నికల కమిషన్ వివరాలు చెబుతున్నాయి. భరోసా పార్టీ, సబ్సీ బడీ పార్టీ, రాష్ట్రీయ సాఫ్ నీతి పార్టీ ఇలా రకరకాల పేర్లతో పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. మార్చి 9వ తేదీ వరకూ రాజకీయ పార్టీలు ఈసీ దగ్గర తమ కొత్త పార్టీని నమోదు చేసుకుంటూనే ఉన్నాయి. దేశంలో గుర్తింపు పొందిన ఏడు జాతీయ పార్టీలు 59 ప్రాంతీయ పార్టీలూ ఉన్నాయి.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే ఫిబ్రవరి, మార్చి నెలల్లో149 రాజకీయ పార్టీలు ఈసీ దగ్గర రిజిస్టర్ చేసుకున్నాయి. 58పార్టీలు గతేడాది నవంబర్ డిసెంబర్ లలో ఎంపీ, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం, చత్తిస్ గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పుట్టినవే బీహార్లోని బహుజన్ ఆజాద్ పార్టీ, యూపీలో సామూహిక్ ఏక్తా పార్టీ, రాజస్థాన్ లో రాష్ట్రీయ సాఫ్ నీతీ పార్టీ,ఢిల్లీలో సబ్సీ బడీ పార్టీ, తెలంగాణ నుంచి భరోసా పార్టీ, తమిళనాడు నుంచి న్యూ జనరేషన్ పీపుల్స్ పార్టీ ఇలా కుప్పలు, తెప్పలుగా కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ పార్టీలు వేటికీ ఒక గుర్తుపై పోటీ చేసే అర్హత లేదు. పోల్ పానెల్ ఇచ్చే కొన్ని గుర్తులను వీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ హోదా కావాలంటే అసెంబ్లీ లేదా పార్లమెంటు ఎన్నికల్లో కనీస ఓట్లు కానీ, కొన్ని సీట్లు కానీ గెలుచుకుని తీరాలి.

రాజకీయ పార్టీల పేరుతో అక్రమ నగదు నిల్వలకు పాల్పడే అవకాశమున్నందున దశాబ్ద కాలంగా ఎన్నికల్లో పోటీ చేయని 255 రిజిస్టర్డ్ పార్టీల ఆర్థిక మూలాలను పరిశీలించాలని ఈసీ ఐటీ శాఖను కోరింది. మొత్తం మీద ఎన్నికలనేవి లాభసాటి వ్యాపారంగా మారిపోయాయి ఏదో ఓ పార్టీ పెట్టేయడం ఆ తర్వాత అభ్యర్ధిని ఉపసంహరించేందుకు ఇతర పార్టీలను డబ్బులు డిమాండ్ చేయడం కొన్ని పార్టీలకు అలవాటుగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories