వ‌ర్షం సాధార‌ణం.. దిగుబ‌డి పెర‌గ‌డం ఖాయం

వ‌ర్షం సాధార‌ణం.. దిగుబ‌డి పెర‌గ‌డం ఖాయం
x
Highlights

రైతులకు తీపి కబురు అందింది. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ఉండనున్నాయి. దేశవ్యాప్తంగా సాధారణ స్థాయి వ‌ర్ష‌పాతం నమోదుకానున్నదని స్కైమెట్ అనే సంస్థ...

రైతులకు తీపి కబురు అందింది. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ఉండనున్నాయి. దేశవ్యాప్తంగా సాధారణ స్థాయి వ‌ర్ష‌పాతం నమోదుకానున్నదని స్కైమెట్ అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ సాధారణ వర్షపాతంతో పంట దిగుబడి కూడా అధికంగానే ఉంటుందని స్కైమెట్ సంస్థ పెర్కోంది. దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు నూటికి 50శాతం కన్నా ఎక్కువగానే ఉన్నట్లు స్కైమెట్ సంస్థ అధినేత జతిన్ సింగ్ వెల్లడించారు. మరి కొన్ని ప్రదేశాలలో మాత్రం అధిక వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించారు. ప్రతిఏటా జూన్‌లో ప్రారంభం అయ్యే రుతుపవనాలపై స్కైమెట్ సంస్థ ఈ ఏడాది ముందుగానే వాతావరణాన్ని అంచనా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories