తోకముడిచిన పాక్‌ .. భారత్ విజయం

తోకముడిచిన పాక్‌ .. భారత్ విజయం
x
Highlights

పాక్‌ను ఏకాకిని చేయడంతో భారత్ విజయం సాధించింది. దౌత్య పరంగా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఉగ్రవాదాన్నివ్యతిరేకిస్తున్న పలు దేశాలు భారత్‌కు...

పాక్‌ను ఏకాకిని చేయడంతో భారత్ విజయం సాధించింది. దౌత్య పరంగా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఉగ్రవాదాన్నివ్యతిరేకిస్తున్న పలు దేశాలు భారత్‌కు అండగా నిలవడంతో పాకిస్థాన్‌ తోకముడిచింది. పాకిస్థాన్‌పై ఒత్తిడి తేవడంలో భారత్ విజయం సాధించింది. అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను ఒంటరి చేయడంతో భారత్ అధికారులు చేసిన కృషి ఫలించింది. పాక్ తలవంచింది. పుల్వామా దాడిలో 40 మందికి పైగా భారత జవాన్లను హతమార్చిన తర్వాత ఉగ్రవాదులతో జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్‌ మాట్లాడిన టేపులను మన అధికారులు పాక్ అధికారులకు అందజేశారు.

ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్ కు ఎదురుదెబ్బ తగిలింది. పాక్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు డిమాండ్ చేశాయి. పాక్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థలపై పాకిస్థాన్ ఉక్కుపాదం మోపాలని అమెరికా కోరింది. మౌలానా మసూద్ అజర్ ను ఏ దేశంలో ప్రయాణించకుండా భద్రతా మండలిలోని 15 సభ్య దేశాలు నిషేధించాలని అమెరికా, బ్రిటన్ , ఫ్రాన్స్ కోరాయి. భారత్ పై పాక్ దాడి పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా, భారత్ , పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడం, పాక్ చేతుల్లోనే ఉందని తెలిపింది.

ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు సద్దుమణిగేందుకు పాక్‌ ప్రధాని చర్చలకు సిద్ధంగా ఉన్నానని వచ్చిన ప్రకటనను భారత్‌ అధికారులు ఘాటుగా స్పందించారు. అటువంటి చర్చలు జరగాలంటే పాక్‌ ముందుగా ఉగ్రవాద నియంత్రణ చర్యలు చేపట్టాలని ముష్కరులను అణచివేసేందుకు తక్షణమే, విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని అప్పుడే ఎటువంటి చర్చలైనా జరుగుతాయని భారత్ స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories